Pushpa 2: అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్.!
ఇప్పుడు ఎక్కడ చూసిన ‘పుష్ప 2’ సినిమా పేరే వినిపిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా బన్నీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఇంకా మూడు వారాల్లోపు థియేటర్లలోకి రానుంది. నవంబర్ 17న పుష్ప 2 ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. వెటరన్ స్టార్ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన ప్రముఖ టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకేలో అల్లు అర్జున్ కనిపించడంతో ప్రమోషన్లు ఇప్పడే షూరు అయ్యాయని బన్నీ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా కొద్ది రోజుల్లో ‘పుష్ప 2’ విడుదల కాబోతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ పాన్-ఇండియా ప్రమోషనల్ కార్యక్రమాలు తీవ్రతరం చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే పుష్ప కొన్ని ఎఫ్‌ఎన్‌సీజీ బ్రాండ్స్ పై కనిపించడం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఎస్ ! తాజాగా డార్క్ ఫాంటసీ బిస్కెట్స్, అగరబత్తిలపై పుష్ప సినిమా పోస్టర్లు అందరీ దృష్టిని ఆకర్షించాయి. ప్రస్తుతం దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక పుష్ప ఫస్ట్ పార్ట్ సౌత్‌లో కంటే నార్త్‌లోనే ఎక్కువగా ఆకట్టుకుంది. పోస్ట్-ప్రొడక్షన్ షెడ్యూల్ల కారణంగా, దర్శకుడు సుకుమార్ ప్రమోషన్లలో పాల్గొనలేకపోయాడు.అల్లు అర్జున్, సహనటి రష్మిక మందన్నతో కలిసి కొన్ని ప్రెస్ మీట్లను మాత్రమే నిర్వహించారు. అయినప్పటికీ, డిసెంబర్ 2020లో విడుదలైన పుష్ప: ది రైజ్ ఉత్తర భారత రాష్ట్రాల్లో దుమ్ము దులిపింది. అలు అర్జున్‌కు ఈ సినిమాతో నార్త్‌లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలోనే పుష్ప2 పై నార్త్ ఆడియన్స్ ఫోకస్ విపరీతంగా ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
మర్రిచెట్టు తొర్రలో.. రూ.15 లక్షలు!
ఈ బుడ్డోడి లక్కే లక్కు.. రూ.200 తో రూ. 50 లక్షల కారు పట్టేసాడు
మహిళా డ్రైవర్ క్యాబ్‌లో ప్రయాణం.. యువతి కామెంట్ వైరల్!
అదృష్టం అంటే ఇతనిదే.. భూమిలో దొరికిన బంగారు నిధి!
వెయిటర్‌పై చేయి చేసుకున్న గెస్ట్.. కట్ చేస్తే
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్

