Allu Arjun Pushpa 2 Look: కన్ఫర్మ్‌.. బన్నీ పుష్ప2లో ఇలాగే కనిపించబోతున్నారు.. నయా లుక్ పై కామెంట్స్..

Allu Arjun Pushpa 2 Look: కన్ఫర్మ్‌.. బన్నీ పుష్ప2లో ఇలాగే కనిపించబోతున్నారు.. నయా లుక్ పై కామెంట్స్..

Anil kumar poka

|

Updated on: Jul 25, 2022 | 7:13 PM

పుష్ప.. ఏ రేంజ్‌ లో సూపర్ డూపర్ హిట్టైందో అందరికీ తెలిసిందే..! సుకుమార్ డైరెక్షన్లో పాన్ ఇండియా రేంజ్‌ లో తెరకెక్కిన ఈ సినిమా.. త్రూ అవుట ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేసింది.



ఏ రేంజ్‌ లో సూపర్ డూపర్ హిట్టైందో అందరికీ తెలిసిందే..! సుకుమార్ డైరెక్షన్లో పాన్ ఇండియా రేంజ్‌ లో తెరకెక్కిన ఈ సినిమా.. త్రూ అవుట ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. దాంతో పాటు.. ఈ సినిమాలో బన్నీ చెప్పిన డైలాగులు.. చేసిన మేనరిజం.. సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. నిజ జీవితంలో.. అందరికీ అలవాటుగా మారిపోయాయి. అయితే అంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్ప సినిమాకు.. సీక్వెల్ వస్తుందంటే.. ఎలా ఉంటుంది. చాలా ఎగ్జైట్ గా ఉంటుంది. కదా.. ఆ ఎగ్జైట్‌లోనూ.. బన్నీ లుక్ ఇంకెలా ఉండబోతోందో చూడాలనే ఆతురత కూడా ఉంటుంది కదా…! అందుకే అన్నట్టు.. తాజాగా తన ఉలక్‌ ఎలా ఉండబోతోందో హింట్ ఇచ్చారు అల్లు అర్జున్‌.ఇక మాసిపోయిన గడ్డంలో.. చిరిగిపోయిన బట్టలతో.. కరీం బీడీ కాలుస్తూ.. పుష్ప పార్ట్ 1లో మాస్‌ను మ్యాచ్‌ చేసిన బన్నీ.. పుష్ప 2లో మాత్రం కాస్త రిచ్‌గా కనిపిస్తారనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. దాంతో పాటు గంధపు చెట్లు కొట్టే.. కూలీ దగ్గర నుచి.. సిండికేట్‌నే ఆపరేట్ చేసే లీడర్‌ వరకు ఎదిగిన పుష్ప.. పార్ట్ లో మాత్రం కాస్త రిచ్గా కనిపిస్తారనే లీక్‌ కూడా ఉంది. అయితే ఈ మాటల్నీ నిజం చేస్తూ.. బన్నీ కాస్త రిచ్‌లుక్లోకి మారిపోయారు. గంధం సిండికేట్ లీడర్‌గా.. ఫష్ట్ పార్ట్ లో మాదిరి కాకుండా.. కాస్త స్టైలిష్ గా కనిపించనున్నారు. అయితే ఈ టాక్‌ను మ్యాచ్ చేస్తూ.. తాజాగా బన్నీ షేర్ చేసిన ఓ ఫోటో.. ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది.తాజాగా ఫేమస్ ఫోటో గ్రాఫర్.. అవినాష్ గోవరికర్ తీసిన ఓ ఫోటోను బన్నీ తన సోషల్ మీడియా హ్యాండిలింగ్‌లో పోస్ట్ చేశారు. అయితే పుష్ప 2 సినిమాలో బన్నీ క్యారీ చేసే లుక్‌ ఇదేనంటూ.. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు బన్నీ హార్డ్ కోర్ ఫ్యాన్స్. కామెంట్స్ చేయడమే కాదు… నెట్టింట ఈ పిక్‌ ను తెగ వైరల్‌ కూడా చేస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Published on: Jul 25, 2022 07:13 PM