Allu Arjun: ఆ లెటర్‌ చూసి ఆశ్చర్యపోయాను.. నమ్మలేకపోయా – అల్లు అర్జున్‌.

|

Apr 09, 2024 | 9:17 PM

దుబాయ్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో తన మైనపు విగ్రహం ఏర్పాటు చేయడంపై తాజాగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ స్పందించారు. మేడమ్‌ టుస్సాడ్స్‌ నుంచి వచ్చిన ఆహ్వానం చూసి తొలుత ఆశ్చర్యపోయానన్నారు బన్నీ. ఓరోజు తాను ఆఫీస్‌కు వెళ్లగానే అక్కడున్నవాళ్లంతా నిలబడి తనను చూసి నవ్వుతున్నారని, ఏం జరుగుతుందో అర్థం కాక చూస్తుంటే తనకు ఓ లెటర్‌ ఇచ్చారని చెప్పారు.

దుబాయ్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో తన మైనపు విగ్రహం ఏర్పాటు చేయడంపై తాజాగా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ స్పందించారు. మేడమ్‌ టుస్సాడ్స్‌ నుంచి వచ్చిన ఆహ్వానం చూసి తొలుత ఆశ్చర్యపోయానన్నారు బన్నీ. ఓరోజు తాను ఆఫీస్‌కు వెళ్లగానే అక్కడున్నవాళ్లంతా నిలబడి తనను చూసి నవ్వుతున్నారని, ఏం జరుగుతుందో అర్థం కాక చూస్తుంటే తనకు ఓ లెటర్‌ ఇచ్చారని చెప్పారు. లెటర్‌ అయితే పూర్తిగా చదవలేదు కాన, దానిపైన మేడమ్‌ టుస్సాడ్స్‌ అని చూడగానే చాలా ఆశ్చర్యం వేసిందన్నారు. తన మైనపు విగ్రహం చూడగానే చాలా సంతోషంగా అనిపించిందన్న ఆయన అది చూడగానే తనను తాను చూసుకున్నట్లు ఉందని తెలిపారు. హెయిర్‌ పార్ట్‌ అద్భుతంగా తీర్చిదిద్దారని, తనకు సంబంధించిన మోస్ట్‌ ఐకానిక్‌ పోజుల్లో తగ్గేదేలే పోజు ఒకటి అని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియాన్ని సందర్శించి తన విగ్రహంతో ఫొటోలు దిగాలని కోరారు. దీనికి సంబంధించిన ఓ వీడియో విడుదలైంది. పుష్ప ది రైజ్‌ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్‌. ఈ చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడిగా ఆయన అవార్డు సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘పుష్ప ది రూల్‌’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. పుష్ప పార్ట్‌1 కు సీక్వెల్‌గా ఇది సిద్ధమవుతోంది. సోమవారం అల్లు అర్జున్‌ పుట్టినరోజును పురస్కరించుకుని పుష్ప ది రూల్‌ టీజర్‌ విడుదల చేయనున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.