Allu Arha: అల్లు అర్హ డబ్బింగ్ వీడియోకు ఇంత క్రేజా.. సో క్యూట్ అంటూ కామెంట్స్ తో హోరెత్తిస్తున్న అర్హ ఫ్యాన్స్..
ఐకాన్ స్టార్‌గా అల్లు అర్జున్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక స్టార్‌కిడ్‌గా బన్నీ కుమార్తె అల్లు అర్హ కూడా చిన్న వయసులోనే పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా
ఐకాన్ స్టార్‌గా అల్లు అర్జున్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక స్టార్‌కిడ్‌గా బన్నీ కుమార్తె అల్లు అర్హ కూడా చిన్న వయసులోనే పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా అందరికీ చేరువైన ఈ క్యూట్ కిడ్ ఇప్పుడు సిల్వర్ స్ర్కీన్ పై కూడా ఎంట్రీ ఇస్తోంది. సమంత ప్రధాన పాత్ర పోషిస్తోన్న శాకుంతలం సినిమాతో అల్లు అర్హ వెండితెరకు పరిచయం కానుంది. ఇందులో అర్హ భరతుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇటీవల విడుదలైన శాకుంతలం సినిమా ట్రైలర్లో సింహంపై స్వారీ చేస్తున్న క్లిప్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలైన సంగతి తెలిసిందే. అందులో ఎంతో క్యూట్‌గా, అందంగా కనిపించిందీ చిన్నారి. తాజాగా శాకుంతలం సినిమాలోని తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించింది అర్హ. ఈ విషయాన్ని అల్లు అర్జున్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. తన ముద్దుల తనయ స్టూడియోలో డబ్బింగ్ చెప్తున్న ఫొటోను షేర్ చేస్తూ దానిపై హార్ట్ సింబల్ ఉంచాడు బన్నీ. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా శాకుంతలం సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. త్రీడీలో కూడా ఈ సినిమాను విడుదల చేయనున్నారు మేకర్స్. కాగా మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘ఎస్ఎస్ఎంబీ28’ చిత్రంలోనూ అల్లు అర్హ నటిస్తోందని టాక్. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!
ఇరానీ చాయ్,కార్పెట్లు,డ్రైఫ్రూట్స్.. హైదరాబాద్‌కు 400 ఏళ్ల బంధం
సంతలో కూరగాయలు కొంటున్నారా.. జాగ్రత్త !
పోలీసులకే షాకిచ్చిన దొంగల మాస్టర్ ప్లాన్ !
నాన్న, అంకుల్ దుబాయ్ వెళ్లారు..ఎలా ఉన్నారో ఏమో?

