అలియా వేసుకున్న ఈ డ్రస్‌ కాస్ట్‌ ఎంతో తెలిస్తే.. నిజంగా షాకవుతారు !!

|

Aug 29, 2022 | 8:33 PM

బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ ప్రస్తుతం ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ఇటు ప్రొఫెషనల్‌, అటు పర్సనల్‌ లైఫ్‌ పరంగానూ మంచి హుషారులో ఉన్నారు.

బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ ప్రస్తుతం ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ఇటు ప్రొఫెషనల్‌, అటు పర్సనల్‌ లైఫ్‌ పరంగానూ మంచి హుషారులో ఉన్నారు. సినిమాల పరంగా గంగూబాయి కతియావాడి, డార్లింగ్స్‌తో మంచి హిట్లు అందుకున్న ఈ అందాలతార త్వరలోనే బ్రహ్మాస్త్రతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. తన భర్త రణ్‌బీర్‌ కపూర్‌ తో కలిసి నటిస్తోన్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ పాన్‌ ఇండియా చిత్రం సెప్టెంబర్‌ 9న విడుదల కానుంది. అటు పర్సనల్‌ లైఫ్‌ విషయానికి వస్తే.. త్వరలోనే తల్లిగా ప్రమోషన్‌ పొందేందుకు రెడీ అయ్యారు ఈ అందాల తార. కాగా గర్భంతో ఉండి కూడా తన సినిమా ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటున్నారు అలియా. బ్రహ్మస్త్ర రిలీజ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో భర్తతో కలిసి తన సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో బేబీ బంప్‌తో దర్శనమిచ్చారు అలియా. గూచీ బ్రాండ్‌కు చెందిన పింక్‌ కలర్‌ డ్రెస్‌, మ్యాచింగ్‌ బ్లాక్‌ ప్యాంట్‌ కోట్‌తో స్టైలిష్‌గా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. నెటిజన్ల మనసులు దోచుకుంటున్నాయి. దీంతో కొందరు అలియా డ్రెస్‌ ధర గురించి నెట్టింట్లో ఆరా తీశారు. కాగా గూచీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ పింక్‌ కలర్‌ చిఫాన్‌ రఫుల్‌ టాప్‌ ధర 4,100 డాలర్లుగా ఉంది. అంటే భారతీయ కరెన్సీలో సుమారు 3,27,883 రూపాయలన్న మాట. దాంతో…వామ్మో ఒక్క డ్రెస్‌కే ఇంత ఖర్చు పెట్టిందా? అంటూ అభిమానులు, నెటిజన్లు షాకవుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ హీరో కర్మ గురించి మాట్లాడింది !! ఇప్పుడు అదే కర్మకు బలైంది !!

Samantha: ఆ ఒక్క కారణంతోనే మొహమాటం లేకుండా NTR ఫిల్మ్ రిజెక్ట్

Published on: Aug 29, 2022 08:33 PM