ఏపీలో సినిమా టికెట్ల ధరలు తగ్గినా ప్రాబ్లమ్ లేదు.. నాగార్జున ఆసక్తికర కామెంట్స్(Video)

చాలా రోజులుగా ఏపీ ప్రభుత్వం, సినిమా ఇండస్ట్రీ మధ్య టికెట్‌ రేట్లపై మాటల తూటాలు పేలుతున్నాయి. అటు ఆర్జీవీ ఎంట్రీతో హీటెక్కిన ఈ ఇష్యూ, కింగ్‌ నాగార్జున కామెంట్స్‌తో...

Ravi Kiran

|

Jan 06, 2022 | 9:50 AM

చాలా రోజులుగా ఏపీ ప్రభుత్వం, సినిమా ఇండస్ట్రీ మధ్య టికెట్‌ రేట్లపై మాటల తూటాలు పేలుతున్నాయి. అటు ఆర్జీవీ ఎంట్రీతో హీటెక్కిన ఈ ఇష్యూ, కింగ్‌ నాగార్జున కామెంట్స్‌తో పీక్‌ స్టేజ్‌కు చేరింది. తాజాగా సినిమా టిక్కెట్ల వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు హీరో నాగార్జున. ప్రస్తుతమున్న పరిస్థితులు తెలిసినా… అన్నింటికీ సిద్ధమయ్యే బంగార్రాజు రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్‌ చేశామన్నారు కింగ్. టిక్కెట్ల రేట్లు ఎలా ఉన్నా, వచ్చే వసూళ్లు వస్తాయన్నారు నాగార్జున. పరిస్థితులు బాగాలేవని, పూర్తయిన సినిమాలను పాకెట్‌లో పెట్టుకుని తిరగలేమన్నారు నాగ్. అందుకే ధైర్యంగా ముందుకొస్తున్నామని చెప్పారు నాగార్డున.Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu