Adivi Seshu: నా తల్లి ఎవరో ఆయనకే తెలీదు..! ఆసక్తికర విషయాలు చెప్పిన అడవి శేష్‌..

Adivi Seshu: నా తల్లి ఎవరో ఆయనకే తెలీదు..! ఆసక్తికర విషయాలు చెప్పిన అడవి శేష్‌..

Anil kumar poka

|

Updated on: May 20, 2022 | 9:50 AM

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా మేజర్.. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డైరెక్టర్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ జూన్ 3 విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది.


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా మేజర్.. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డైరెక్టర్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ జూన్ 3 విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‏లో భాగంగా ఇటీవల ఓ షోలో పాల్గోన్న అడివి శేష్.. వ్యక్తిగత విషయాలతోపాటు.. కెరీర్‏కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. చందమామ సినిమాలో తనకు క్యారెక్టర్ సెట్ కాకపోవడంతో సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలిపారు..అడివిశేష్ మాట్లాడుతూ.. తన అసలు పేరు అడివి సన్నీ కృష్ణ అని.. అమెరికాలో ఉన్నప్పుడు తన స్నేహితులు తనను సన్నీ లియోన్ అంటూ ఆటపట్టించేవారని తెలిపారు.. అలాగే. అమెరికాలో భారతీయులకు కేవలం టెర్రరిస్ట్, పెట్రోల్ బంకులో పనిచేసే వ్యక్తి ఇలాంటి పాత్రలే ఇస్తారని.. ఇండియన్ వ్యక్తి అక్కడ హీరో కాలేడని.. ఇప్పటికీ అక్కడ భారతీయులు కమెడియన్ పాత్రలలోనే కనిపిస్తారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా.. కాజల్‌ హీరోయిన్‌గా వచ్చిన చందమామ సినిమాలో తనను ముందుగా నవదీప్ పాత్ర కోసం తీసుకున్నారని.. కానీ క్యారెక్టర్ తనకు సెట్ కాకపోవడంతో రెండు రోజుల తర్వాత సినిమా నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారు. బాహుబలిలో తాను పోషించిన పాత్రకు తల్లి ఎవరో డైరెక్టర్ రాజమౌళికి కూడా తెలియదన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

killer lady: భర్తకు తెలియకుండా ఇద్దరితో అఫైర్.. ఆ తర్వాత ఓ మర్డర్.. సినిమాను మించిన సస్పెన్స్..

Mango tips: మామిడి పండ్లు సహజంగా పండినవా.. కెమికల్ వేసి పండించారా.. ఇలా గుర్తించండి.!

Published on: May 20, 2022 09:50 AM