Shobha Shetty: ‘బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించేయండి’ కన్నీళ్లతో వేడుకున్న శోభాశెట్టి.!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లాగే కన్నడలో కూడా బిగ్ బాస్ షో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ప్రస్తుతం అక్కడ 11వ సీజన్ నడుస్తోంది. ఈ కన్నడ రియాలిటీ షో ప్రారంభమై సుమారు 50 రోజులకు పైగా అయ్యింది. మెయిన్ కంటెస్టెంట్స్ కు తోడు ఇటీవల ఇద్దరు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి అడుగుపెట్టారు. అందులో బిగ్ బాస్ తెలుగు ఫేమ్, కార్తీక దీపం మోనిత అలియాస్ శోభా శెట్టి కూడా ఉంది.
బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా అడుగుపెట్టిన శోభాశెట్టి బిగ్ బాస్ హౌస్ లో ఉండలేకపోతోంది. హౌస్‌లోకి వచ్చిన మొదట్లో ఫుల్ జోష్ లో ఉన్నట్లు కనిపించిన మోనిత ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోయింది. తనను బిగ్ బాస్ నుంచి బయటకు పంపించాలని కన్నీళ్లు పెట్టుకుంటోంది. ఈ వారం శోభా శెట్టి నామినేషన్స్ లో నిలిచింది. కానీ ఆడియెన్స్ ఆమెకు ఓటు వేసి కాపాడారు. అయితే శోభాశెట్టి మాత్రం హౌస్ లో ఉండడం ఇష్టం లేదంటోంది. ఈ విషయాన్ని సుదీప్ ముందు చెప్పిన శోభాశెట్టి.. తనను బయటకు పంపించేయాలని దీనంగా వేడుకుంది.
దీంతో శోభాశెట్టికి సుదీప్ సలహా ఇస్తూ.. ‘ఈ బిగ్ బాస్ హౌస్ లోనికి రావడానికి ఉద్దేశ్యం ఏంటో ఒకసారి ఆలోచించు’ అన్నాడు. ఆ తర్వాత ‘మీకు ఓట్లు వేసిన ఆడియెన్స్ కు అన్యాయం చేస్తున్నారంటే ఏం చెబుతారు?’ అని ప్రశ్నించాడు. అయినా సరే, శోభాశెట్టి తాను బయటకు వెళ్లాల్సిందేనని పట్టుబట్టింది. ఎట్టకేలకు శోభాశెట్టి మాటలకు చలించిన సుదీప్.. బిగ్ బాస్ హౌస్ తలుపులు తెరిచాడు. అయితే శోభాశెట్టి బయటకు వెళ్లిందా లేదా అనేది సస్పెన్స్‌లో పెట్టాడు బిగ్ బాస్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.