సినిమా కీచకులపై యాక్షన్.. సీనియర్ నటితో ప్రత్యేక మిషన్
మలయాళీ చిత్ర పరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ వెలువడిన తర్వాత నటులపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే కొందరు ఆర్టిస్టులపై కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో తమ ఇండస్ట్రీలలోనూ ఇలాంటి కమిటీలను ఏర్పాటు చేయాలని కొందరు నటీమణులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ లో మహిళలపై వేధింపులు అడ్డుకునేందుకు నడిగర్ సంఘం రంగంలోకి దిగింది.
మలయాళీ చిత్ర పరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ వెలువడిన తర్వాత నటులపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే కొందరు ఆర్టిస్టులపై కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో తమ ఇండస్ట్రీలలోనూ ఇలాంటి కమిటీలను ఏర్పాటు చేయాలని కొందరు నటీమణులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కోలీవుడ్ లో మహిళలపై వేధింపులు అడ్డుకునేందుకు నడిగర్ సంఘం రంగంలోకి దిగింది. సినీ పరిశ్రమలో ఎదురవుతున్న చేదు అనుభవాలు, వేధింపుల గురించి ఫిర్యాదు చేసేందుకు ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీకి నటి రోహిణిని అధ్యక్షురాలిగా నియమించారు. ఈ క్రమంలోనే ఈ సీనియర్ నటి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. రీసెంట్‌గా మీడియాతో మాట్లాడిన రోహిణీ.. మహిళలు ఫిర్యాదులు చేసేందుకు ముందుకు రావాలని అన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రుజువైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఐదేళ్లపాటు నిషేధం విధిస్తామని.. అలాంటి వేధింపులను ఎదుర్కొన్న మహిళలకు అన్ని రకాల న్యాయ సహాయం అందేలా చూస్తామని ఆమె అన్నారు. ఈ కమిటీలో వచ్చే ఫిర్యాదులను నడిగర్ సంఘం ద్వారా సైబర్ పోలీసులకు పంపిస్తామని అన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Tamannaah Bhatia: 2 సార్లు బ్రేకప్.. మరి విజయ్ వర్మతో ప్రేమ ముచ్చట సంగతేంటి ??
మరీ అగ్గువ రేట్‌కే స్టార్ హీరో.. తెలివిగా ఆలోచించిన బిగ్ బాస్ టీం
ఆలియా యాక్టింగ్‌కు కల్కి డైరెక్టర్ ఫిదా.. ఓ రేంజ్‌లో పొగడ్తలు !!
తనపై లైంగిక ఆరోపణలు చేసిన లేడీపై.. పక్కా ప్రూఫ్స్‌తో ఆన్సర్ ఇచ్చిన స్టార్ హీరో
సెన్సర్లతో.. కొండచరియలు విరిగిపడడాన్ని ముందే గుర్తించవచ్చా ??