Nayanthara: గజినీ చేయకుండా ఉండాల్సింది సూర్య సినిమాపై నయన్ సీరియస్ కామెంట్స్.

|

Jun 23, 2024 | 11:11 AM

లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుని.. అటు కోలీవుడ్, టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లో కూడా స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది నయన తార. ఎప్పుడూ సినిమాలతో.. మిగిలిన టైం తన భర్త విఘ్నేశ్ అండ్ తన కవల పిల్లలతో బిజీగా ఉండే ఈ బ్యూటీ.. గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు. షాకింగ్ గా సూర్య గజినీ సినిమాలో నటించకుండా ఉండాల్సిందనే కామెంట్‌ ఆ ఇంటర్వ్యూలో ఆమె నుంచి రావడంతో.. ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతున్నారు.

లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుని.. అటు కోలీవుడ్, టాలీవుడ్‌లోనే కాదు.. బాలీవుడ్‌లో కూడా స్టార్ ఇమేజ్ తెచ్చుకుంది నయన తార. ఎప్పుడూ సినిమాలతో.. మిగిలిన టైం తన భర్త విఘ్నేశ్ అండ్ తన కవల పిల్లలతో బిజీగా ఉండే ఈ బ్యూటీ.. గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు. షాకింగ్ గా సూర్య గజినీ సినిమాలో నటించకుండా ఉండాల్సిందనే కామెంట్‌ ఆ ఇంటర్వ్యూలో ఆమె నుంచి రావడంతో.. ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతున్నారు. సూర్య హీరోగా చేసిన ‘గజినీ’ సెన్సేషనల్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అందులో అసిన్​ మెయిన్ హీరోయిన్‌ కాగా.. నయన్​ కూడా కీలక పాత్రలో కనిపించింది. చిత్ర అనే మెడికల్ స్టూడెంట్​ పాత్రలో యాక్ట్ చేసింది. అయితే ఆ రోల్ త‌న సినీ కెరీర్​లోనే అత్యంత బ్యాడ్ సెలక్షన్ అంటూ కామెంట్స్ చేసింది. తాను ఇప్పటివరకు నటించిన మూవీస్ మొత్తంలో ‘గజిని’లో నటించినందుకు మాత్రమే చింతిస్తున్నానంటూ వెల్లడించింది. ఈ సినిమాలో తన పాత్రను త‌న‌కు చెప్పినట్లుగా షూట్ చేయలేదని చెప్పింది. ఆ సమయంలో ఆ విషయాన్ని తాను పట్టించుకోలేదని… దాన్ని ఓ లెర్నింగ్ ప్రాసెస్​గా భావించినట్లు తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.