ముద్దు సీన్‌లో కంట్రోల్‌ తప్పిన హీరో.. హీరోయిన్‌ చీవాట్లు…

Updated on: Apr 05, 2025 | 12:42 PM

క్యాస్టింగ్ కౌచ్ పేరుతో ఫిల్మ్ ఇండస్ట్రీలో వేధింపులు ఉన్నాయి. ఇక ఇవి చాలవన్నట్టు.. మూవీస్‌లో కాస్త ఇంటిమసీ సీన్లు చేసేటప్పుడు కూడా అప్పుడప్పుడు తమ కో స్టార్స్‌తో, తాము ఇబ్బంది పడుతుటాం అంటూ చెప్పారు బాలీవుడ్ బ్యూటీ అనుప్రియ గోయెంకా. చెప్పడమే కాదు.. తనకు జరిగిన ఇలాంటి ఓ సందర్భంగా గురించి వివరించారు. కాస్త ఎమోషనల్ అయ్యారు.

పాంచాలి, అసుర్ లాంటి వెబ్ సిరీస్‌ల ద్వారా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అనుప్రియా గోయెంకా. తన యాక్టింగ్ ట్యాలెంట్‌తో పాటు.. తన బ్యూటీతో బాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన ఈమె.. తనకు ఎదురైన ఓ షాకింగ్ ఇన్‌సిడెంట్‌ గురించి చెప్పారు. తనతో తన కోస్టార్స్ ఇబ్బందికరంగా వ్యవహరించిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు. తన కెరీర్‌ బిగినింగ్‌లో ఫస్ట్ లిప్‌ లాక్ సీన్లో… తనతోపాటు నటించే కోఆర్టిస్ట్ దానిని అడ్వాంటేజ్ గా తీసుకున్నాడని అనుప్రియా చెప్పుకొచ్చారు. ఆ టైంలో తను కంట్రోల్‌ తప్పి.. నడుముపై కాకుండా నడుము కింది భాగంలో చేయివేశాడని చెప్పారు. దాంతో ఒక్క సారిగా షాకైన తాను.. ఇంకో సారి ఇలా చేయొద్దని కాస్త గట్టిగా చెప్పినట్టు చెప్పారు. కానీ మరో టేక్‌లో ఆ హీరో అలాగే చేయడంతో.. కాస్త కోపంగా చీవాట్లు పెట్టినట్టు చెప్పుకొచ్చారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Alekhya Chitti: అలేఖ్య చిట్టి పచ్చళ్ల ఇష్యూలో.. సజ్జనార్‌కు ట్యాగ్ చేస్తున్న నెటిజెన్స్..

పిట్ట కూడా వాలని చెట్టు.. ఎందుకంత డేంజర్‌ ??

Gond Katira: సమ్మర్‌లో గోండ్‌ కటిరా తింటున్నారా.. ఇది మీ కోసమే!

సిల్వర్ స్క్రీన్ మీద నయా గ్లామర్.. టాలీవుడ్‌ను రూల్ చేయడం పక్క

ఇంటిముందు ఏర్పడిన భారీ గుంత.. ఏంటా అని పరిశీలించగా.. బయటపడిన ఆలయం