ప్రభాస్, షారుఖ్ రికార్డ్స్ బద్దలుకొట్టిన.. కుర్ర హీరో..

Updated on: Jul 12, 2025 | 12:29 PM

తాజాగా IMDb అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రాల జాబితాను పంచుకుంది. అందులో ఒక సినిమా బడ్జెట్ తక్కువగా ఉన్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం 500 రెట్లు ఎక్కువగా రాబట్టాయి. అంతేకాదు కలెక్షన్స్‌తో పాటే నయా రికార్డ్ ను కూడా క్రియేట్ చేశాడు ఆ యంగ్ హీరో. ప్రభాస్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోలను కూడా వెనక్కి నెట్టేశాడు. అతనెవరో కాదు.. ఆ హీరో పేరే విక్కీ కౌశల్.

IMDb ఈ సంవత్సరం 1st జనవరి నుంచి 1st జూలై వరకు ఉన్న సినిమాలను ప్రకటించింది. అందులో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ నటించిన ఛావా అగ్రస్థానంలో ఉంది. డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఛావా అనే చారిత్రాత్మక చిత్రంలో విక్కీ కౌశల్, రష్మిక మందన్న, వినీత్ వంటి తారలు నటించారు. ఈ చిత్రం 809 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. బడ్జెట్ 130 కోట్లు కాగా, ఈ చిత్రం 500% లాభం రాబట్టింది. ఇక ఈ సంవత్సరం ఇదే అతిపెద్ద బ్లాక్ బస్టర్. ఛావాలో అక్షయ్ ఖన్నా, రష్మిక మందన్న, దివ్య దత్తా, వినీత్ కుమార్ సింగ్ , విక్కీ కౌశల్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా..బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇక IMDB విడుదల చేసిన జాబితాలోడ్రాగన్ 2వ స్థానంలో, దేవా 3వ స్థానంలో, రైడ్2 4వ స్థానంలో, రెట్రో 5వ స్థానంలో, ది డిప్లొమాట్ 6వ స్థానంలో, ఎంపురాన్ 7వ స్థానంలో, సితారే జమీన్ పర్ 8వ స్థానంలో, కేసరి చాప్టర్-2 9వ స్థానంలో, విదాముయార్చి 10వ స్థానంలో ఉన్నాయి. ఆక ఈ విషయం కాస్త పక్కకు పెడితే.. ప్రస్తుతం ఛావా మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దానిమ్మ, స్ట్రాబెర్రీతో అద్భుత ఆరోగ్యం..!

సెకనుకు రూ.10 లక్షలు.. ప్రైవేట్ జెట్.. ఈ హీరోయిన్ రేంజే వేరు

కుళ్లిపోయి, దారుణ స్థితిలో హీరోయిన్ డెడ్ బాడీ.. పోలీసులకే సవాల్

బిగ్ బాస్‌లోకి నిఖిల్ మాజీ లవర్‌ !! సెలక్షన్స్‌తో గూగ్లీ విసురుతున్న బిగ్ బాస్

ఊ.. అన్న మాంచి ఆటగాడే..! ఐకాన్ స్టార్‌పై సరదా ట్రోలింగ్