ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై శ్రుతిహాసన్ ఫైర్.. ఏం జరిగిందంటే ??
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై ప్రముఖ నటి శృతిహాసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు కారణం తాను ఎక్కాల్సిన విమానం ఏకంగా 4 గంటల పాటు ఆలస్యం కావడమే. దాంతో ఇండిగోపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. తాను సాధారణంగా ఫిర్యాదులు చేయననీ, కానీ ప్రయాణికులకు సేవలు అందించడంలో ఇండిగో విమానయాన సంస్థ రోజురోజుకీ దిగజారుతోందని ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై ప్రముఖ నటి శృతిహాసన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు కారణం తాను ఎక్కాల్సిన విమానం ఏకంగా 4 గంటల పాటు ఆలస్యం కావడమే. దాంతో ఇండిగోపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. తాను సాధారణంగా ఫిర్యాదులు చేయననీ, కానీ ప్రయాణికులకు సేవలు అందించడంలో ఇండిగో విమానయాన సంస్థ రోజురోజుకీ దిగజారుతోందని ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతోపాటు పలువురు ప్రయాణికులు ఎయిర్‌పోర్టులో విమానం కోసం ఎదురుచూస్తూ 4 గంటల పాటు ఉండిపోయామని శృతిహాసన్ తెలిపారు. ఎయిర్‌లైన్స్ సిబ్బంది విమానం ఆలస్యం విషయమై కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని ఆమె మండిపడ్డారు. ఇకనైనా ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా విమానయాన సంస్థ తన సర్వీసులను మెరుగుపర్చుకోవాలని హితవు పలికారు. ఇక శ్రుతిహాసన్ ట్వీట్‌పై ఇండిగో ఎయిర్‌లైన్స్ స్పందించింది. ప్రతికూల వాతావరణం కారణంగా విమానం ఆలస్యమైందని తెలిపింది. ఈ విషయాన్ని శ్రుతిహాసన్ అర్థం చేసుకుంటారని భావిస్తున్నామని ఇండిగో పేర్కొంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

