రూ.300 నుంచి రూ.50 కోట్ల వరకు! ప్రకాశ్ రాజ్ దిమ్మతిరిగే సంపాదన
కళను నమ్ముకున్న వాడు.. కష్టాలు లేకుండా బతకగలడనే సామెత ఉంది. ఇక ఆ సామెను నిజం చేస్తూ... అదే కళను నమ్ముకున్న ప్రకాశ్ రాజ్ ఇప్పుడు పేరు ప్రఖ్యాతలు మాత్రమే కాదు డబ్బుతో కూడా వర్థిల్లుతున్నాడు. హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. 300 రూపాయల జీతంతో తన యాక్టింగ్ కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈయన.. ఇప్పుడు ఏకంగా ఒక్కో సినిమాకు 3 కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ను తీసుకునే వరకు రీచ్ అయ్యాడు.
సినీప్రియులకు నటుడు ప్రకాష్ రాజ్ సుపరిచితమే. హీరోగా సినీ ప్రయాణం స్టార్ట్ చేసిన ఆయన .. ఆ తర్వాత విలన్ పాత్రలతో అదరగొట్టారు. నటుడిగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగానూ రాణిస్తున్నారు. బెంగళూరులో పుట్టి పెరిగిన ఆయన.. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్నారు. కళాక్షేత్ర అనే నాటక సంస్థలో చేరి రంగస్థల నాటకాల్లో నటించారు. ఆ సమయంలో ఆయన జీతం కేవలం 300 మాత్రమే. అదే సమయంలో డైరెక్టర్ బాల చందర్ తో ఏర్పడిన పరచయం .. ఆయనను సినీరంగం వైపు అడుగులు వేసేలా చేసింది. 1994లో డ్యూయెట్ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశారు. తన మొదటి సినిమా పేరుతోనే సొంతంగా డ్యూయెట్ మూవీస్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఇప్పటివరకు నాలుగుసార్లు జాతీయ అవార్డ్ గెలుచుకున్నారు. ప్రకాశ్ రాజ్‌కు తొలిసారిగా జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన సినిమా ఇరువర్. అంతేకాదు మణిరత్నం దర్శకత్వం వహించిన కాంచీవరం సినిమాకు కూడా ప్రకాశ్ రాజ్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సినిమాలోని దెయ్యం థియేటర్‌లోకి వచ్చిందా ?? వణుకుపుట్టించిన ఘటన
మంచు విష్ణుకు బిగ్ షాక్ ‘కన్నప్ప’ సినిమా హార్డ్‌డిస్క్ చోరీ..

బందర్లో దృశ్యం మార్క్ క్రైమ్ కహానీ..భర్త హత్యకు శ్రీమతి స్కెచ్

హనీమూన్‌లో విషాదం.. రైలు ఎక్కబోతూ అనంతలోకాలకు వీడియో

యజమాని కోసం కుక్క ప్రాణత్యాగం.. 26 సార్లు పాముకాట్లు వీడియో

70 ఏళ్లుగా సహజీవనం! ఎట్టకేలకు పెళ్లి చేసిన పిల్లలు వీడియో

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో
