అయ్యోరామ్‌ !! ఒక్క క్షణం ఆలోచించి ఉంటే కథ వేరేలా ఉండేది గా !!

|

Aug 19, 2022 | 9:09 AM

డైరెక్టర్ హనురాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమా బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

డైరెక్టర్ హనురాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమా బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ చిత్రానికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే రూ. 50 కోట్ల వసూళ్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. రామ్ పాత్రలో దుల్కర్, సీతామహాలక్ష్మీ పాత్రలో మృణాల్ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. సీతారామం థియేటర్లలో దూసుకపోతుండగా.. మరోవైపు ఈ మూవీలోని సాంగ్స్ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్నాయి. విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. ఇక మహానటి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన దుల్కర్ సల్మాన్ ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. టాలీవుడ్ ఆడియన్స్ మనసులలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అయితే ఈ సినిమాలో రామ్ పాత్ర కోసం దుల్కర్ కంటే ముందుగా ఇద్దరు స్టార్ హీరోలను సంప్రదించారని టాక్ వినిపిస్తోంది. డైరెక్టర్, మేకర్స్ కలిసి న్యాచురల్ స్టార్ నాని, రామ్ పోతినేనిని సంప్రదించగా.. డేట్స్ కుదరకపోవడంతో వారిద్దరు ఈ మూవీ నుంచి తప్పుకున్నారట. దీంతో ఈ ఆఫర్ దుల్కర్ వద్దకు వెళ్లింది. ఇక కంటెంట్ నచ్చడంతో రామ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ హీరో.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ కోడి గుడ్డు ధర రూ. 50వేలు !! దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా ??

దూసుకొస్తున్న రైలుకు ఎదురెళ్లి కుక్కను కాపాడిన వ్యక్తి !! వ్యక్తిపై ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

మామగారిని నడిరోడ్డుపై చెప్పుతో కొట్టిన కోడలు !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

Published on: Aug 19, 2022 09:09 AM