కింగ్ నాగ్ క్రేజీ డెసిషన్.. జైలర్‌కు తనేంటో చూపించేందుకు రెడీ!

Updated on: May 30, 2025 | 5:40 PM

అందరి హీరోలుగా కాదు.. ఎప్పుడూ కాస్త డిఫరెంట్‌గా ఆలోచించే కింగ్ నాగార్జున ఇప్పుడు మరోసారి తన స్టైల్లోనే ఆలోచించి ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు ఉన్నారు. ఇప్పుడా నిర్ణయంతో టాలీవుడ్‌లో మాత్రమే కాదు.. అటు కోలీవుడ్‌లో కూడా హాట్ టాపిక్ అవుతున్నాడు నాగ్. ఇంతకీ నాగ్ తీసుకున్న ఆ షాకింగ్ నిర్ణయం ఏంటంటే.. విలన్‌గా నటించడానికి రెడీ అవ్వడం !

ఎస్ ! రజినీ కాంత్ – నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న జైలర్ 2 సినిమాలో మన కింగ్ నాగార్జున విలన్‌ గా చేయనున్నాడట. నిజానికి ముందు ఈ సినిమాలో హీరోగా ఎస్ జే సూర్యను ఫిక్స్ చేశారు మేకర్స్. కానీ తన వేరే కమిట్మెంట్స్‌ కారణంగా ఈ సినిమాకు డేట్స్‌ అడ్జెస్ట్ చేయలేకపోతున్నారట సూర్య. దీంతో ఈ సినిమాలో కింగ్ నాగ్‌ను విలన్‌గా తీసుకుంటే జైలర్ 2 సినిమాకు వేరే లెవల్‌ క్రేజ్ వస్తుందని థింక్ చేసిన నెల్సన్.. రీసెంట్‌ గా నాగార్జునను అప్రోచ్ అయ్యారట. ఎప్పుడూ డిఫరెంట్‌ గా ఆలోచించే నాగ్.. నెల్సన్ అప్రోచ్ అండ్ క్యారెక్టర్ డిజైన్ నచ్చడంతో .. ఓకే చెప్పాడట. అయితే ఇది అఫీషియల్ న్యూస్ కాకపోయినా.. ఈ న్యూస్ మాత్రం ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్‌లో వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఒకప్పుడు తోపు హీరోయిన్.. యాక్సిడెంట్‌తో మతిమరుపు.. సన్యాసిగా జీవితం

ఫ్యాన్ అలా పిలిచే సరికి.. సిగ్గుతో మొగ్గలేసిన రష్మిక

హీరో ఉపేంద్ర నుంచే దొంగిలించా.. సీక్రెట్ చెప్పేసిన సుకుమార్

1500 సార్లు టీవీలో వచ్చినా.. మరో సరికొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేసిన మహేష్‌

14 ఏళ్ల తర్వాత అవార్డ్స్‌.. అల్లు అర్జునే తొలి విజేత