గణపతికి 10వేల కొబ్బరికాయలు కొట్టి.. మొక్కు తీర్చుకున్న స్టార్ హీరో వీడియో
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఆయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని సినీ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఇటీవల విడుదలైన కిష్కింధపురి సినిమా విజయం సాధించిన నేపథ్యంలో, తన తండ్రి బెల్లంకొండ సురేష్ మొక్కులో భాగంగా తొలి విడతగా 10,000 కొబ్బరికాయలు సమర్పించారు. అనంతరం అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి వారిని కూడా దర్శించుకున్నారు.
అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఆయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని ప్రముఖ టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గురువారం దర్శించుకున్నారు. ఇటీవల రిలీజ్ అయిన కిష్కింధపురి సినిమా విజయవంతం కావడంతో, ఆయన ఈ ఆలయానికి వచ్చారు. నారికేళ ప్రియుడైన ఆయినవిల్లి వినాయకునికి 50,000 కొబ్బరికాయలు కొడతానని హీరో తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ గతంలో మొక్కుకున్నారు. ఆ మొక్కును తీర్చేందుకు హీరో శ్రీనివాస్ గురువారం ఆలయానికి విచ్చేశారు. ఆలయ అధికారులు ఆయనకు సాదరంగా స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తండ్రి మొక్కులో భాగంగా తొలి విడతగా 10,000 కొబ్బరికాయలను బెల్లంకొండ శ్రీనివాస్ స్వామివారికి సమర్పించారు. తండ్రి మొక్కు చెల్లించినందుకు సంతోషంగా ఉందని ఈ సందర్భంగా శ్రీనివాస్ తెలిపారు. అనంతరం ఆయన అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి వారిని కూడా దర్శించుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
