Kamareddy: ప్రభుత్వ హాస్పిటల్‌లో గోడలకు విద్యుత్ షాక్..

Kamareddy: ప్రభుత్వ హాస్పిటల్‌లో గోడలకు విద్యుత్ షాక్..

Ram Naramaneni

|

Updated on: Jul 20, 2024 | 9:12 AM

షాక్‌ల కాలం.. జరభద్రం... వర్షాకాలంలో విద్యుత్‌ ప్రమాదాలు పొంచి ఉంటాయి. ముందుస్తు అప్రమత్తతో లేకపోతే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే అందరూ ఇంటా, బయటా విద్యుత్‌ షాక్‌తో అప్రతమత్తంగా ఉండాల్సి అవసరం ఉంది.. తాజాగా కామారెడ్డి  జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి గోడలకు విద్యుత్ ప్రవాహం జరిగింది.

కామారెడ్డి  జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్‌లో గోడలకు విద్యుత్ షాక్ రావడంతో కలకలం రేగింది.  ఫ్యామిలీ ప్లానింగ్ విభాగంలో గోడలకు విద్యుత్ సరఫరా అయింది. ఈ క్రమంలో పలువురు రోగులు, రోగుల బంధువులు.. విద్యుదాఘాతానికి గురయ్యారు. దీంతో వెంటనే అలెర్టయిన ఆస్పత్రి సిబ్బంది… ఫ్యామిలీ ప్లానింగ్ విభాగంలో చికిత్స పొందుతున్న పేషెంట్లను మరో వార్డుకు షిఫ్ట్ చేశారు.  పై భాగం నుంచి నీరు స్లాబ్ గుండా గోడలకు చేరడంతో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారింది. దీంతో ఎలక్ట్రికల్ బోర్డులు, ఫ్యాన్‌లు దగ్ధమయ్యాయి. ఎవరికి ప్రమాదం సంభవించకపోవడంతో ఆస్పత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..