AP News: ఆన్ చేయకుండానే బోర్ నుంచి ఉబికి వస్తున్న నీరు.. వీడియో
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు ఏపీలోని పలు జిల్లాల్లో వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కేస్ రామవరంలో బోరు నుండి నీరు ఎగిసిపడుతోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బోరు ఉన్న ప్రాంతమంతా వరద నీరు చేరింది. బోరు ఆన్ చేయకుండానే నీరు వస్తుండడంతో గ్రామస్తులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. బోరు నుంచి నీరు ఉబికి వస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎక్కడ చూసినా నీటి ప్రవాహం పొంగిపొర్లుతోంది. అన్ని చోట్ల చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. జలాశయాల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. కొన్ని వందల అడుగుల్లో బోరు వేసినా నీరు రాని బోర్లు కూడా ఇపుడు ఎలాంటి మోటార్లు అవసరం లేకుండానే బయటకు నీరు ఉబికి వస్తోంది. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కేస్ రామవరంలో బోరు నుండి నీరు ఎగిసిపడుతోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బోరు ఉన్న ప్రాంతమంతా వరద నీరు చేరింది. బోరు ఆన్ చేయకుండానే నీరు వస్తుండడంతో గ్రామస్తులు ఆశ్చర్యంగా చూస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..
Latest Videos
వైరల్ వీడియోలు