Watch Video: కిరాయి కోసం ఇంతటి కిరాతకమా.. ఏకంగా కళ్యాణ మండపంలోనే

Edited By: Srikar T

Updated on: Jun 01, 2024 | 5:20 PM

హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. ఫంక్షన్ హాల్ కిరాయి అడిగినందుకు యాజమాన్యంపైనే దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. పాతబస్తీ ప్రాంతంలోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఫంక్షన్ హాల్ లీజు విషయంలో ఈ రగడ జరిగింది. ఆ ఫంక్షన్ హాల్‎కు సంబంధించిన వ్యక్తులపై దాడి జరిగింది. గత సంవత్సరకాలంగా ఫంక్షన్ హాల్‎కి రెంట్ చెల్లించలేదని అడగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ సమస్య పరిష్కారం కోసం గతంలో ఫంక్షన్ హాల్ యాజమాన్యం కోర్టు వరకూ వెళ్లింది. అయితే కోర్టు సైతం యజమాన్యానికే అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. ఫంక్షన్ హాల్ కిరాయి అడిగినందుకు యాజమాన్యంపైనే దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. పాతబస్తీ ప్రాంతంలోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఫంక్షన్ హాల్ లీజు విషయంలో ఈ రగడ జరిగింది. ఆ ఫంక్షన్ హాల్‎కు సంబంధించిన వ్యక్తులపై దాడి జరిగింది. గత సంవత్సరకాలంగా ఫంక్షన్ హాల్‎కి రెంట్ చెల్లించలేదని అడగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ సమస్య పరిష్కారం కోసం గతంలో ఫంక్షన్ హాల్ యాజమాన్యం కోర్టు వరకూ వెళ్లింది. అయితే కోర్టు సైతం యజమాన్యానికే అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఈ స్థలం తమకే చెందుతుందని ఫంక్షన్ హాల్ ఖాళీ చేయవలసిందిగా అద్దెకు ఉన్న వ్యక్తులతో యజమాని చెప్పాడు. అయితే.. దీనికి ఒప్పుకోకుండా 8 మంది ఒక్కచోట చేరి కట్టెలు, రాడ్లు, సీసాలతో ఫంక్షన్ హాల్ యజమానిపై తీవ్రంగా దాడికి దిగారు.

దీంతో బాధితులు బండ్లగూడ పోలీసులను ఆశ్రయించారు. పూర్తి సమాచారం అందించి తమపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. కాగా, దాడిలో తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు వ్యక్తులను హాస్పిటల్‎కు తరలించారు. ప్రస్తుతం బాధితులకు చికిత్స అందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బండ్లగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపై తగిన విధంగా చర్యలు చేపట్టి న్యాయం చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Jun 01, 2024 05:20 PM