గుడ్డు ఏ టైంలో తింటే మంచిది.. ప్రతి ఒక్కరు తప్పక తెలుసుకోవాల్సిన విషయం

Updated on: Nov 27, 2025 | 4:20 PM

కోడిగుడ్లు సంపూర్ణ పోషక విలువలతో నిండిన ఆహారం. రోజూ గుడ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి, అలసట తగ్గి, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. జింక్, ఐరన్ వంటి పోషకాలు శరీరానికి శక్తినిస్తాయి. పూర్తి ప్రయోజనాల కోసం గుడ్లను ఉడకబెట్టి ఉదయం లేదా మధ్యాహ్నం పూట తీసుకోవడం ఉత్తమం. రాత్రిపూట తినడం మానుకోండి.

కోడిగుడ్ల‌లో అన్నిరకాల పోష‌కాలు ఉంటాయి. అందుకే కోడిగుడ్ల‌ను సంపూర్ణ పౌష్టికాహారంగా చెబుతారు. రోజూ ఒక కోడిగుడ్డును తినాల‌ని పోష‌కాహార నిపుణులు, వైద్యులు సూచిస్తుంటారు. రోజుకొక గుడ్డునుతింటే అనేక లాభాలు క‌లుగుతాయి. కోడిగుడ్డులోని ఈ పోషకాలు పూర్తిగా శరీరానికి లభించాలంటే.. వాటిని ఉడ‌క‌బెట్టి తిన‌డ‌మే మంచిదంటున్నారు పోషకాహార నిపుణులు. తద్వారా పోష‌కాహార లోపం నుంచి సులభంగా బయటపడొచ్చంటున్నారు. అయితే గుడ్ల‌ను ఏ స‌మ‌యంలో తినాలి? ఏ స‌మయంలో తింటే మ‌న‌కు ఎక్కువ పోష‌కాలు ల‌భిస్తాయి? నిపుణులేమంటున్నారో చూద్దాం. కోడి గుడ్ల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. ముఖ్యంగా జింక్ అధికంగా ఉంటుంది. ఇది తెల్ల ర‌క్త క‌ణాలు ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తుంది. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ద‌గ్గు, జ‌లుబు వంటి సీజ‌న‌ల్ వ్యాధుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. జింక్ వ‌ల్ల పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం పెరుగుతుంది. వీర్యం ఉత్ప‌త్తి అవుతుంది. కోడిగుడ్ల‌లో ఉండే మెగ్నిషియం కండ‌రాల నొప్పుల‌ను త‌గ్గించి కండ‌రాల‌కు బ‌లం క‌లిగేలా చేస్తుంది. కోడిగుడ్ల‌లో ఐర‌న్ కూడా అధికంగానే ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ ఉత్ప‌త్తి అయ్యేలా చేస్తుంది. ర‌క్తం వృద్ధి చెందేలా చూస్తుంది. దీంతో ర‌క్త‌హీన‌త త‌గ్గుతుంది. అలాగే నీర‌సం, అల‌స‌ట త‌గ్గుతాయి. కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల ప్రోటీన్ల‌ను అధికంగా పొంద‌వ‌చ్చు. దీని వ‌ల్ల శ‌రీరానికి శ‌క్తి ల‌భించి చురుగ్గా ప‌నిచేస్తారు. శ‌రీరంలో శ‌క్తి స్థాయిలు అధికంగా ఉంటాయి. బ‌ద్ద‌కం త‌గ్గిపోతుంది. కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు. దీంతో ఆహారం త‌క్కువ‌గా తింటారు. ఇది బ‌రువు త‌గ్గేందుకు స‌హాయం చేస్తుంది. కోడిగుడ్ల‌ను ఉద‌యం తిన‌డం వ‌ల్ల ఎక్కువ లాభాలు ఉంటాయ‌ని అధ్య‌య‌నాల్లో తేలింది. ముఖ్యంగా ఉద‌యం వ్యాయామం చేసిన అనంత‌రం గుడ్ల‌ను తింటే శ‌రీరానికి శ‌క్తి ల‌భించి యాక్టివ్‌గా ఉంటారు. రోజంతా చురుగ్గా ప‌నిచేయ‌గ‌లుగుతారు. రోజంతా శారీరక శ్ర‌మ చేసేవారు కూడా ఉద‌యం గుడ్ల‌ను తింటే మేలు జ‌రుగుతుంది. ఎక్కువ సేపు ప‌నిచేయ‌గ‌లుగుతారు. నీర‌సం, అల‌స‌ట రాకుండా ఉంటాయి. అయితే కోడిగుడ్ల‌ను ఉడ‌క‌బెట్టి తింటే ఎక్కువ మేలు జ‌రుగుతుంది. అయితే కోడిగుడ్ల‌ను రాత్రి పూట తిన‌కూడ‌దు. తింటే శ‌రీరంలో అన‌వ‌సరంగా క్యాల‌రీలు, కొలెస్ట్రాల్ చేరుతాయి. ఇవి శరీరానికి హాని చేస్తాయి. క‌నుక కోడిగుడ్ల‌ను ఉద‌యం లేదా మ‌ధ్యాహ్నం మాత్ర‌మే తినడం మంచిదంటున్నారు నిపుణులు. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడం మంచిది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అంబేద్కర్ పేరునూ సహించలేరా ?? కోనసీమ జిల్లా పేరుపై మరోసారి రగడ

బైకర్‌ను ఆపిన ట్రాఫిక్‌ పోలీస్‌.. అతని బైక్‌పై ఉన్న చలాన్లు చూసి షాక్‌

ఊరంతా ఒకే చోటే భోజనం వందల ఏళ్ల నాటి సంప్రదాయం

40 సార్లు ఫారిన్ ట్రిప్పులు.. 5 ఏళ్లలో రూ.100 కోట్లు.. ఐబొమ్మ రవి లగ్జరీ లైఫ్ ను చూస్తే

బిగ్‌ బాస్‌ సీరియస్ ఆ ముగ్గురికీ రెడ్ కార్డ్‌ ??