Health: అరటిపండు, బొప్పాయి కలిపి తింటున్నారా.? ఎంత ప్రమాదమో తెలుసా.?

|

Dec 10, 2024 | 4:13 PM

సాధారణంగా పండ్లు ఏవైనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే వైద్యులు, ఆహార నిపుణులు తరచూ పండ్లు తినమని చెబుతుంటారు. ప్రతి రోజు ఏదో ఒక పూట పండ్లు తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అంటుంటారు నిపుణులు. అయితే, చాలా మంది కొన్ని రకాల పండ్లను కలిపి ఫ్రూట్ సలాడ్స్‌ రూపంలో చేసుకుని తింటుంటారు. అయితే ఇది అంత మంచిది కాదంటున్నారు. ఎందుకంటే, కొన్ని రకాల పండ్లను కొన్నింటితో కలిపి తినకూడదు.

అన్ని రకాల పండ్లు వాటి స్వంత స్వభావం కలిగి ఉంటాయి. విభిన్న స్వభావం గల రెండు రకాల పండ్లను కలిపి తినడం వల్ల అవి ఆరోగ్యానికి హాని చేస్తాయంటున్నారు నిపుణులు. . ఆయుర్వేదం ప్రకారం అరటి, బొప్పాయి పండు కలిపి తినడం ప్రమాదకరం అంటున్నారు. గుండె, పొట్ట ఆరోగ్యానికి అరటిపండు ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయి పండు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. ఈ రెండు పండ్లను విడివిడిగా తినడం వల్ల శరీరానికి మేలు జరుగుతుంది. కానీ కలిపి తినడం వల్ల శరీరానికి హాని చేస్తుందంటున్నారు నిపుణులు. ఆయుర్వేదం ప్రకారం, అరటిపండు శరీరాన్ని చల్లబరుస్తుంది. బొప్పాయి శరీరాన్ని వేడి చేస్తుంది. ఈ రెండు పదార్థాలను కలిపి తింటే జీర్ణశక్తి క్షీణించి తలనొప్పి, వాంతులు, తల తిరగడం, అలర్జీ, అజీర్ణం వంటి సమస్యలు రావచ్చు అంటున్నారు నిపుణులు. ఆస్తమా లేదా శ్వాస సమస్యలు ఉన్నవారు బొప్పాయి తినకూడదని చెబుతున్నారు. బొప్పాయి తినడం వల్ల అలర్జీ వస్తుంది. అంతే కాకుండా మొటిమలు, దురద వంటి చర్మ సమస్యలు ఉన్నవారు కూడా బొప్పాయి తినకూడదని చెబుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.