Weight Loss: వెయిట్‌ లాస్‌ కోసం చపాతీ తింటున్నారా.? అయితే డేంజర్‌లో పడ్డట్టే..!

|

Nov 30, 2024 | 6:15 PM

మనం తీసుకునే పౌష్టికాహారం పైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అందుకే నిపుణులు తరచూ మనం తీసుకునే ఆహారంలో తగినంతగా పోషకాలు ఉండేలా చూసుకోమని తరచూ చెబుతుంటారు. ఇక చాలా మంది వెయిట్‌ లాస్‌ కోసం చపాతీ తింటుంటారు. చపాతీ ఆరోగ్యానికి మంచిదే కానీ, కొందరికి మాత్రం ఇది మంచిదికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కొంతమందికి టిఫిన్, డిన్నర్‌ లేదా లంచ్‌కి చపాతీ తినే అలవాటు ఉంటుంది. అయితే.. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చపాతీ తినకూడదని నిపుణులు బెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు అన్నానికి బదులు గోధుమ చపాతీ తింటారు. ఇందులో అమిలోపెక్టిన్ అనే స్టార్చ్ మాలిక్యూల్స్ ఉంటాయి. డయాబెటిస్ రోగులు ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అలసిపోయినా, నీరసంగా ఉన్నా చపాతీ తినవద్దని సూచిస్తున్నారు. ఎందుకంటే గోధుమలలోని కార్బోహైడ్రేట్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల అలసట, నీరసం వస్తాయి. అలాగే ఏదైనా థైరాయిడ్ సమస్య ఉన్నవారు కూడా చపాతీ తినడం మంచిది కాదంటున్నారు. ఎందుకంటే గోధుమలలో గ్లూటెన్ పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇది ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందట. అధిక బరువుతో చాలామంది అన్నం మానేసి చపాతీ తింటారు. చపాతీలు ఎక్కువగా తింటే బరువు తగ్గడానికి బదులు పెరుగుతారట.. కాబట్టి వీలైనంత వరకు చపాతీకి దూరంగా ఉండటం మంచిదంటున్నారు. చపాతీ ఎక్కువగా తినడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు కూడా వస్తాయట. అలాగే, గోధుమలలోని గ్లూటెన్ పేగులలో మంటను కలిగిస్తుందట. పొట్ట సంబంధిత సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం మంచిదంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.