Hyderabad: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో తత్తరపడుతూ కనిపించిన ప్యాసింజర్.. ఆపి తనిఖీ చేయగా..
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ప్రయాణికుడి నుంచి రూ.4.15 కోట్ల విలువైన 4.15 కిలోల హైడ్రోపోనిక్ కలుపును స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్‌ఐ ఆదివారం తెలిపింది. DRI అధికారులు బ్యాంకాక్ నుండి హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్న ఒక ప్రయాణీకుడిని అడ్డుకున్నారు. లగేజ్ చెక్ చేయగా...
శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు చేసిన తనిఖీల్లో భారీగా హైడ్రోపోనిక్ గాంజా పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు వచ్చిన ప్యాసింజర్‌పై డీఆర్ఐ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని బ్యాగేజ్ చెక్ చేయడంతో బ్యాగ్ అడుగు భాగంలో గ్రీన్ కలర్ పదార్థం కనిపించింది. గ్రీన్ కలర్ పదార్థాన్ని టెస్టింగ్ చేసిన డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అది హైడ్రోపోనిక్ గాంజాగా తేల్చారు. దీంతో హైడ్రోపోనిక్ గాంజాను స్వాధీనం చేసుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పట్టుబడ్డ హైడ్రోపోనిక్ విలువ దాదాపు 4 కోట్ల 15 లక్షలు ఉంటుందని అంచానే వేస్తున్నారు డిఆర్ఐ అధికారులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.