దేశ వ్యాప్తంగా పేలుళ్లకు రెండేళ్ల నుంచే సన్నాహాలు వీడియో
ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో భాగమైన డాక్టర్ షాహీన్ విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ సంస్థ కోసం దేశవ్యాప్తంగా దాడులు చేసేందుకు దాదాపు రెండేళ్ల నుంచి సన్నాహాలు చేస్తున్నట్లు ఆమె తెలిపింది. అమ్మోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలు సేకరించినట్లు అంగీకరించింది.
ఫరీదాబాద్ ఉగ్ర కుట్రలో భాగస్వామి అయిన డాక్టర్ షాహీన్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు జరిపేందుకు దాదాపు రెండేళ్ల నుంచి విస్తృత సన్నాహాలు చేస్తున్నట్లు ఆమె అధికారులకు వెల్లడించింది. పాకిస్థాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్ర సంస్థ కోసం ఈ దాడులను ప్లాన్ చేసినట్లు షాహీన్ ఒప్పుకుంది. ఫరీదాబాద్ మాడ్యూల్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో డాక్టర్ షాహీన్‌ను అరెస్టు చేసి, తదుపరి విచారణ నిమిత్తం శ్రీనగర్‌కు తరలించారు.విచారణ సమయంలో, దేశంలో అనేకచోట్ల ఉగ్రదాడులు జరపడం గురించి ఉమర్ ప్రతిసారీ ఉద్వేగభరితంగా మాట్లాడేవాడని షాహీన్ తెలిపినట్లు సమాచారం. డాక్టర్ ముజిమ్మెల్ ఆదితో కలిసి ఆమె దాదాపు రెండేళ్ల నుంచి అమ్మోనియం నైట్రేట్ వంటి పేలుడు పదార్థాలను సేకరిస్తున్నట్లు అంగీకరించింది.
మరిన్ని వీడియోల కోసం :
మరో స్పెషల్ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా వీడియో
మాట జారాను.. మన్నించండి వీడియో
Published on: Nov 13, 2025 01:17 PM