ఉల్లి డయాబెటిస్‌కు చెక్ పెడుతుందా ?? పరిశోధన ఏం చెబుతుంది ??
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు. ఈ మాటల్లో నిజముందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని అంటారు. ఈ మాటల్లో నిజముందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. మధుమేహ రోగులకు ఉల్లిపాయ సూపర్ ఫుడ్ అని, రోజూ ఉల్లిపాయ తింటే రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుందని అమెరికాలోని శాన్ డీగో ఎండోక్రైన్ సొసైటీ నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. టైప్ 2 డయాబెటీస్ రోగులకు ఇచ్చే యాంటీ డయాబెటిక్ డ్రగ్ మెట్‌ఫార్మిన్‌తో పాటు ఉల్లిపాయ కూడా తీసుకుంటే షుగర్ లెవల్స్ 50శాతం వరకు తగ్గే అవకాశం మెరుగ్గా ఉందని ఆ అధ్యయనంలో తేలినట్టు ది ఇండిపెండెంట్ పత్రిక ప్రచురించింది. అయితే ఇంకా ఎలుకల్లోనే ఈ ప్రయోగం జరిగిందని మానవ ప్రయోగాలు జరిగేంతవరకు ఒక నిర్ధారణకు రాలేమన్నారు. మరోవైపు సెంటర్ ఫర్ డయోబెటిస్ చైర్మన్ డాక్టర్ అనూప్ శర్మ ఈ అధ్యయనంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారతీయులు ఉల్లిపాయ చాలా ఎక్కువగా తింటారని అలాంటప్పుడు భారత్ మధుమేహగ్రస్తులకు ఎందుకు హాట్‌స్పాట్‌గా మారిందని ప్రశ్నించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
2200 ఏళ్ల నాటి నరకానికి ప్రవేశ మార్గం !! చెక్కు చెదరలేదు
Viral Video: జిమ్‌లో వర్కౌట్ చేస్తూ తలకిందులుగా ఇరుక్కుపోయిన మహిళ !!
పెద్దాయనే కానీ.. గట్టాయన.. తన డ్యాన్స్ తో నెటిజన్స్ ఫిదా చేసిన.. ఓల్డర్ యంగ్ మ్యాన్
Ganesh Nimajjanam: బై బై గణేశ.. హుస్సేన్ సాగర్ కు తరలివస్తున్న గణనాథులు