Viral Video: జిమ్‌లో వర్కౌట్ చేస్తూ తలకిందులుగా ఇరుక్కుపోయిన మహిళ !!
వర్కౌట్ చేస్తుండగా ఓ మహిళ తలకిందులుగా ఇరుక్కన్న షాకింగ్ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
వర్కౌట్ చేస్తుండగా ఓ మహిళ తలకిందులుగా ఇరుక్కన్న షాకింగ్ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. ఓహయోకు చెందిన క్రిస్టిన్ ఫాల్డ్స్ అనే మహిళ ఉదయం 3 గంటలకు ఒంటరిగా ఇంట్లోని జిమ్‌లో ఇన్వర్షన్ టేబుల్ అనే ఎక్విప్‌మెంట్‌పై వర్కౌట్స్ చేస్తోంది. వెన్నెముక, నడుమునొప్పి తగ్గేందుకు దీనిని ఉపయోగించి ఎక్సర్‌సైజ్ చేస్తుంటారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా అప్పుడే ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఉన్నట్టుండి మహిళ ఇన్వర్షన్ టేబుల్‌పై తలకిందులైంది. కాళ్లు అందులో ఇరుక్కుపోవడంతో ఎంత ప్రయత్నించినా తిరిగి మామూలు స్థితికి రాలేకపోయింది. సాయం కోసం జిమ్‌లో జాసన్ అనే మరో వ్యక్తిని పిలిచినా భారీ సౌండ్‌తో మ్యూజిక్ ప్లే అవుతుండటం వల్ల అతనికి వినిపించలేదు. పైకి లేవలేక, బయటకు రాలేక అలాగే ఇబ్బంది పడింది. కాసేపు ఏం చేయాలో తోచలేదు. వెంటనే ఆమెకు ఓ ఉపాయం తట్టింది. స్మార్ట్ వాచ్ ఉపయోగించి ఎమర్జెన్సీ నెంబర్ 911కు కాల్ చేసింది. తన పరిస్థితిని వివరించి, సాయం కావాలని కోరింది. స్పందించిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని తలకిందులుగా ఉన్న ఆమెను రక్షించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను స్వయంగా ఆమె టిక్‌టాక్‌లో పోస్టు చేయంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెద్దాయనే కానీ.. గట్టాయన.. తన డ్యాన్స్ తో నెటిజన్స్ ఫిదా చేసిన.. ఓల్డర్ యంగ్ మ్యాన్
Ganesh Nimajjanam: బై బై గణేశ.. హుస్సేన్ సాగర్ కు తరలివస్తున్న గణనాథులు
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు

