Ponnaganti Curry: ఈ ఆకుకూరలో ఉన్న ఆ రహస్యం తెలిస్తే అసలు వదిలిపెట్టరు..

|

May 13, 2024 | 10:55 AM

ప్రకృతిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడమే కాకుండా మంచి శక్తిని అందిస్తాయి. ముఖ్యంగా ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే ఆకు కూరలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. అలాంటి వాటిలో అమరాంథేసి కుటుంబానికి చెందిన పొన్నగంటి కూర కూడా ఒకటి. ఈ ఆకు కూర సంవత్సరం పొడవునా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.

ప్రకృతిలో ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షించడమే కాకుండా మంచి శక్తిని అందిస్తాయి. ముఖ్యంగా ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే ఆకు కూరలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉంటాయి. అలాంటి వాటిలో అమరాంథేసి కుటుంబానికి చెందిన పొన్నగంటి కూర కూడా ఒకటి. ఈ ఆకు కూర సంవత్సరం పొడవునా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఈ ఆకు కూర పొలాల గట్ల వెంట సహజసిద్ధంగా పెరుగుతుంది. పొన్నగంటి కూరలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలే కాదు, అందానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో బీటా కెరోటిన్, ఐరన్,ఫైబర్, క్యాలిష్యం, విటమిన్ ఎ విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి.

పొన్నగంటి కూర మంచి పోషక విలువలు గలిగిన ఆకుకూర. దీనిని పప్పులో వేయడం కన్నా వట్టిదే వేయించి తింటే ఎంతో రుచిగా వుంటుంది. బరువు తగ్గాలనుకునే వారు ఈ ఆకు కూరను తరచూ తింటే మంచిది. ఇందులో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఆకు కూరను ఎలా తీసుకున్నా వాటిలో ఉన్న ప్రయోజనాలను పొందవచ్చు. మోకాళ్ల నొప్పులు ఉన్నవారు వారంలో మూడుసార్లు ఈ కూరను ఏదో ఒక రూపంలో తీసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ ఆకును శుభ్రంగా కడిగి ఆరబెట్టి పొడిగా తయారు చేసుకుని అన్నంలో కలుపుకుని కూడా తినొచ్చు. శరీరంలో వేడిని తగ్గిస్తుంది. తల నొప్పి తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ ఆకుకూరను ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.