Rahul Gandhi: రాహుల్‌ గాంధీ వెనకున్న ఫొటో ఎవరు తీసారో తెలుసా..?? ( వీడియో )

Phani CH

|

Updated on: Jun 24, 2021 | 5:15 PM

కరోనా కష్టకాలంలో దేశ ప్రజలను ఆదుకోవడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ తాజాగా ఓ వీడియోను రిలీజ్‌చేశారు.

కరోనా కష్టకాలంలో దేశ ప్రజలను ఆదుకోవడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని విమర్శిస్తూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ తాజాగా ఓ వీడియోను రిలీజ్‌చేశారు. ఓ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నరాహుల్‌ రాబోయే థర్డ్‌ వేవ్‌ను ప్రభుత్వం ఎలా ఎదుర్కోవాలో సూచిస్తూ శ్వేతపత్రం విడుదల చేశారు. అయితే వీడియో బాక్‌గ్రౌండ్‌లో గోడపై ఉన్న ఓ ఫొటో ట్విట్టర్‌ నెటిజనుల దృష్టిని ఆకర్షించింది. ఫ్రేమ్‌ కట్టిన ఫొటోలో నీలిరంగు ఆకాశం.. ఎవరెస్ట్‌ శిఖరం అందాలు స్పష్టంగా కనువిందు చేస్తున్నాయి. ఈ ఫొటో తీసిన ఫొటోగ్రాఫర్‌ ఎవరబ్బా అని ఆలోచిస్తున్న ట్విట్టర్‌ నెటిజనులకు సమాధానం దొరికేసింది. ఈ ఫోటోను క్లిక్‌మనిపించింది రైహాన్‌ రాజీవ్‌ వాద్రా అని తెలిసింది. 20 ఏళ్ళ రైహాన్‌ రాజీవ్‌ వాద్రా కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంకా, రాబర్ట్‌ వాద్రాల గారాలపట్టి. రైహాన్‌ స్వతహాగా మంచి ఫొటోగ్రాఫర్‌ కూడా. ఇన్‌స్టాలో రైహాన్‌ ఫొటోగ్రఫీ పేజ్‌కి 8 వేల మంది అభిమానులున్నారట. ” ఆన్‌ టాప్‌ ఆఫ్‌ ద వరల్డ్‌.. మౌంట్‌ ఎవరెస్ట్‌ ఫ్రం ద స్కై ” అనే కాప్షన్‌తో ఎవరెస్ట్‌ శిఖరం ఫొటోను గత ఫిబ్రవరిలో రైహాన్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: గుజరాత్‌లో ఏలియన్స్‌.! మిస్టరీగా మారిన ఆకాశంలో వింత కాంతి… ( వీడియో )

Sachin Tendulkar: పాట పాడిన సచిన్… త్రోబ్యాక్ వీడియోను షేర్ చేసిన క్రికెట్ గాడ్.. ( వీడియో )

Published on: Jun 24, 2021 05:14 PM