Cyclone Alert: తీవ్ర తుఫానుగా బలపడిన వాయుగుండం.. ఏపీలో అతి భారీవర్షాలు
దిత్వా తుఫాన్ తీవ్ర తుఫాన్‌గా బలపడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాలకు చేరుతోంది. దీని ప్రభావంతో ఏపీలోని ప్రకాశం, నెల్లూరు సహా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయ్యింది. శని, ఆదివారాల్లో భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నాలుగు రోజులపాటు ప్రభావం ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
మొన్న మొంథా.. నిన్న సెన్యార్, ఇప్పుడు దిత్వా. ఒక తుఫాన్ ముప్పు తప్పిందనుకుంటే మరొకటి ముంచుకొస్తోంది. ఇలా వరుస తుఫాన్లు వణుకు పుట్టిస్తున్నాయి. దీని టార్గెట్ కూడా ఏపీనే. మరి దీని ప్రభావం ఎలా ఉంటుంది..? వాతావరణశాఖ అధికారలు ఏం చెబుతున్నారు? నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా బలపడి తీవ్ర తుఫానుగా మారిందని ఐఎండీ ప్రకటించింది. ప్రస్తుతం బట్టికాలోవాకుకు 20 కి.మీ., పుదుచ్చేరికి 520 కి.మీ., చెన్నైకి 620 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. ఈ తుఫాన్‌కు దిత్వాగా నామాకరణం చేశారు. ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు-పుదుచ్చేరికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా తీరం వైపు గంటకు 15 కి.మీ వేగంతో తుఫాన్ పయనిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున నైరుతి బంగాళాఖాతం ఆనుకుని తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాలకు చేరే అవకాశముందంటున్నారు వాతావరణశాఖ అధికారులు. దీంతో తమిళనాడుతోపాటు ఆంధ్రాలోని దక్షిణ తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాను ప్రభావంతో కోస్తా, రాయలసీమలో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఏపీలోని అన్ని ఓడరేవుల్లో రెండో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నవంబరు 30న ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అత్యంత భారీ వర్షం కురిసే అవకాశముందని రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆయా జిల్లాల్లో 20 సెం.మీకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశముందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ తుఫాన్‌కు దిత్వా అని నామకరణం చేశారు. దీని ప్రభావం నాలుగు రోజులపాటు ఉంటుందని అంచనా వేస్తున్నారు. చెన్నై– పుదుచ్చేరి మధ్య తీరం దాటుతుందని భావించినా తీరం దాటే అవకాశాలు తగ్గినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. తీరం వెంబడి ప్రయాణిస్తూ బలహీనపడే అవకాశం అధికంగా ఉందంటున్నారు . దీంతో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఊరంతా ఒకే చోటే భోజనం వందల ఏళ్ల నాటి సంప్రదాయం ??
TOP 9 ET News: స్పిరిట్ లో చిరు.. పక్కా సమాచారం..?
Kaantha OTT: అప్పుడే OTTలోకి కాంతా మూవీ
ఎటు చూసినా నీళ్లే.. శ్రీలంకను ముంచిన వరుణుడు
చనిపోయిన తల్లిలా వేషం వేసిన కొడుకు.. మూడేళ్లుగా రూ. 80 లక్షల పింఛను కోసం నాటకం
హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో
యముడికే మస్కా కొట్టిన ఒకే ఒక్కడు వీడియో
సైబర్ మోసం.. ఇలా చేస్తే డబ్బు వాపస్ వీడియో
సాగర తీరాన 'బీచ్ ఫెస్టివల్'కు వేళాయె వీడియో
బాబోయ్ చలి..మరో మూడు రోజులు గజగజ వీడియో
భయానకం.. ఆ అనుభవం,రైలు టాయిలెట్లో లాక్ చేసుకున్న మహిళ వీడియో
ప్రమాదంలో స్కై డైవర్ విమానం తోకను చుట్టిన పారాచూట్ వీడియో

