తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

|

Apr 18, 2024 | 10:00 PM

వాతావరణ పరిస్థితుల కారణంగాఒక్కోసారి గొంతు నొప్పి సమస్య తలెత్తుతుంది. ఇది శరీరంలో డిఫ్తీరియా వ్యాధికి సంకేతం కావచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత కొద్ది రోజులుగా పలుచోట్ల ఈ వ్యాధి కేసులు నమోదవుతున్నాయి. వైద్యులు అభిప్రాయం ప్రకారం.. డిఫ్తీరియా వ్యాధిని గల్గోటు అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి బారీన పడిన వారిలో గొంతు నొప్పితో పాటు, తేలికపాటి జ్వరం కూడా వస్తుంది. అంతేకాకుండా, డిఫ్తీరియా రోగికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మెడలో వాపు, నిరంతర దగ్గు ఉంటుంది.

వాతావరణ పరిస్థితుల కారణంగాఒక్కోసారి గొంతు నొప్పి సమస్య తలెత్తుతుంది. ఇది శరీరంలో డిఫ్తీరియా వ్యాధికి సంకేతం కావచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత కొద్ది రోజులుగా పలుచోట్ల ఈ వ్యాధి కేసులు నమోదవుతున్నాయి. వైద్యులు అభిప్రాయం ప్రకారం.. డిఫ్తీరియా వ్యాధిని గల్గోటు అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి బారీన పడిన వారిలో గొంతు నొప్పితో పాటు, తేలికపాటి జ్వరం కూడా వస్తుంది. అంతేకాకుండా, డిఫ్తీరియా రోగికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మెడలో వాపు, నిరంతర దగ్గు ఉంటుంది. ఈ వ్యాధి కారణంగా చర్మం రంగు నీలం రంగులోకి మారవచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోకూడదు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. డిఫ్తీరియా వ్యాధి.. బ్యాక్టీరియా వల్ల వస్తుందని ఢిల్లీలోని సీనియర్ వైద్యుడు డాక్టర్ అజయ్ కుమార్ చెబుతున్నారు. ఈ బ్యాక్టీరియా గాలిలో ఉంటుంది. ఇవి గాలి ద్వారా శరీరంలోకి ప్రవేశించి గొంతులో ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా శ్వాసకోశంలో పొర ఏర్పడుతుంది. దీని కారణంగా రోగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతాడు. ఆ తర్వాత పొర నుంచి బ్యాక్టీరియా రక్తం ద్వారా గుండె, మెదడుకు వ్యాపిస్తుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??

Hyderabad: నాన్ వెజ్ ప్రియులకు అలెర్ట్.. ఈ ఆదివారం షాపులు బంద్

దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??

పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. వామ్మో.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా..

ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!