పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం.. మండిపడుతున్న జనం
రోడ్డుపై ప్రయాణించేటప్పుడు వాహనదారులు జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రమాదం ఎటునుంచి ఏ రూపంలో దూసుకొస్తుందో తెలీదు. అయినా కొందరు నిర్లక్ష్యంగా వ్యహరిస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటుంటారు. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఇందులో ఓ జంట పిల్లవాడిని స్కూటీ ఫుట్ రెస్ట్‌పైన నిలబెట్టి ప్రయాణిస్తున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. బెంగళూరుకు చెందిన ఓ జంట నగరంలోని రద్దీగా ఉండే వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో తమ స్కూటీపై వెళ్తున్నారు.
రోడ్డుపై ప్రయాణించేటప్పుడు వాహనదారులు జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రమాదం ఎటునుంచి ఏ రూపంలో దూసుకొస్తుందో తెలీదు. అయినా కొందరు నిర్లక్ష్యంగా వ్యహరిస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకుంటుంటారు. అందుకు ఉదాహరణే ఈ వీడియో. ఇందులో ఓ జంట పిల్లవాడిని స్కూటీ ఫుట్ రెస్ట్‌పైన నిలబెట్టి ప్రయాణిస్తున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి నెటిజన్లు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. బెంగళూరుకు చెందిన ఓ జంట నగరంలోని రద్దీగా ఉండే వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో తమ స్కూటీపై వెళ్తున్నారు. ఆ సమయంలో దంపతులిద్దరూ సీటుపై కూర్చోగా.. కుమారుడుని మాత్రం ఫుట్‌రెస్ట్ పై నిలబెట్టి ప్రయాణిస్తున్నారు. రద్దీ రహదారిపై రాత్రి సమయంలో వారు ప్రమాదకరంగా ప్రయాణిస్తూ కనిపించారు. అటుగా వెళ్తున్న స్థానికులు అది చూసి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు దంపతులపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కుమారుడిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆ మహిళను కఠినంగా శిక్షించాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరేమో ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ బెంగళూరు ట్రాఫిక్ పోలీసులను కోరుతున్నారు. మరోవైపు ఈ వీడియోపై బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు కూడా స్పందించారు. ఘటనపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్ షేక్.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
Hyderabad: నాన్ వెజ్ ప్రియులకు అలెర్ట్.. ఈ ఆదివారం షాపులు బంద్
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. వామ్మో.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

