Srisailam: శ్రీశైల మల్లికార్జునుడికి విరాళాల వెల్లువ

|

Feb 28, 2024 | 8:56 PM

మహాశివరాత్రి సమీపిస్తుండటంతో ప్రముఖ పుణ్యక్షేత్రం, శక్తిపీఠం శ్రీశైలంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా స్వామి అమ్మవార్ల దర్శనానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో అధికారులు తగిన ఏర్పాట్లు చేయడంలో ఆలయ అధికారులు, సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు మహాశివరాత్రి సందర్భంగా స్వామి అమ్మవార్లకు భక్తులు వివిధ రూపంలో విరాళాలు అందజేస్తున్నారు.

మహాశివరాత్రి సమీపిస్తుండటంతో ప్రముఖ పుణ్యక్షేత్రం, శక్తిపీఠం శ్రీశైలంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా స్వామి అమ్మవార్ల దర్శనానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో అధికారులు తగిన ఏర్పాట్లు చేయడంలో ఆలయ అధికారులు, సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు మహాశివరాత్రి సందర్భంగా స్వామి అమ్మవార్లకు భక్తులు వివిధ రూపంలో విరాళాలు అందజేస్తున్నారు. ఇటీవలే చెన్నైకి చెందిన ఓ భక్తురాలు స్వామిఅమ్మవార్లకు బంగారుపళ్లెం కానుకగా సమర్పించారు. తాజాగా అమెరికాకు చెందిన మరో కుటుంబం భ్రమరాంబిక,మల్లికార్జునుల కళ్యాణానికి అవసరమైన బంగారు, వెండి సామాగ్రిని విరాళంగా అందజేశారు. అమెరికాకు చెందిన కొత్తపల్లి సునీల్ దత్, కుటుంబసభ్యులు 28 గ్రాముల 300 మిల్లీ గ్రాముల బరువుగల 2 బంగారు బాషికాలు, 5 గ్రాముల బరువుగల బంగారు కంకణం, 1 కేజీ 25 గ్రాముల బరువుతో ఒక వెండి పళ్ళెం, 865 గ్రాముల బరువు గల మరో వెండి పళ్ళెం, 550 గ్రాముల బరువుగల వెండి నాగహారతి, 290 గ్రాముల బరువుగల వెండి శక్తి ఆయుధం, 420 గ్రాముల బరువుగల కుక్కుటధ్వజం, 750 గ్రాముల బరువు గల 5 వెండి గిన్నెలు, 920 గ్రాముల బరువు గంధాక్షత గిన్నె,190 గ్రాముల బరువుగల చిన్న వెండి కమండలాన్ని , 300 గ్రాముల బరువుగల మరో పెద్ద కమండలాన్ని దేవస్థానానికి విరాళంగా అందజేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మసాలాలతో క్యాన్సర్‌ నిరోధించే ఔషధాలు !! మద్రాస్ ఐఐటీ శాస్త్రవేత్తల పరిశోధన

బరువు తగ్గాలనుకునేవారు ఈ ఆహారం అస్సలు తీసుకోకూడదు

ప్రపంచంలో ఎవరిపై అయినా జూమ్‌ !! నింగిలోకి నిఘా ఉపగ్రహం

మెట్రో రైలు ఎక్కకుండా రైతును అడ్డుకున్న సెక్యూరిటీ అధికారులపై నెటిజన్లు ఫైర్‌

కారు బానెట్‌పై వ్యక్తిని ఈడ్చుకెళ్లిన డ్రైవర్‌ !! కేకలు వేసినా ఆపకుండా 3 కి.మీ

Follow us on