మెట్రో రైలు ఎక్కకుండా రైతును అడ్డుకున్న సెక్యూరిటీ అధికారులపై నెటిజన్లు ఫైర్
రోజూ లక్షల మంది ప్రయాణిస్తున్న బెంగళూరు మెట్రో రైల్ వివాదంలో చిక్కుకుంది. మెట్రోలోని సెక్యూరిటీ సూపర్‌వైజర్ చేసిన ఓ పనికి విమర్శలు వెల్లువెత్తున్నాయి. స్థానికులు మెట్రో కార్పొరేషన్ అధికారులపై సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ట్రాఫిక్ నగరంగా పేరు గాంచిన బెంగళూరులో ప్రజలు ఎక్కువగా మెట్రో రవాణాకే ఓటేస్తారు. ఉద్యోగులు, సామాన్యులు ఇలా నిత్యం లక్షల మంది మెట్రో రైలులో రాకపోకలు సాగిస్తుంటారు.
రోజూ లక్షల మంది ప్రయాణిస్తున్న బెంగళూరు మెట్రో రైల్ వివాదంలో చిక్కుకుంది. మెట్రోలోని సెక్యూరిటీ సూపర్‌వైజర్ చేసిన ఓ పనికి విమర్శలు వెల్లువెత్తున్నాయి. స్థానికులు మెట్రో కార్పొరేషన్ అధికారులపై సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ట్రాఫిక్ నగరంగా పేరు గాంచిన బెంగళూరులో ప్రజలు ఎక్కువగా మెట్రో రవాణాకే ఓటేస్తారు. ఉద్యోగులు, సామాన్యులు ఇలా నిత్యం లక్షల మంది మెట్రో రైలులో రాకపోకలు సాగిస్తుంటారు. ఓ రైతు కూడా మెట్రో రైలు ఎక్కేందుకు ఆదివారం బెంగళూరులోని రారాజీనగర్ మెట్రో స్టేషన్‌కు వెళ్లాడు. అయితే, ఆ రైతును సెక్యూరిటీ సూపర్‌వైజర్ అడ్డుకున్నాడు. బట్టలు మురికిగా ఉన్నాయంటూ వస్త్రాలను సాకుగా చూపుతూ రైతును రైలెక్కకుండా అడ్డుకున్నాడు. టికెట్ ఉందని రైతు చూపించినప్పటికీ సెక్యూరిటీ చెక్ వద్ద లోపలికి అనుమతించలేదు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఈ ఘటన వివాదాస్పదమైంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కారు బానెట్‌పై వ్యక్తిని ఈడ్చుకెళ్లిన డ్రైవర్ !! కేకలు వేసినా ఆపకుండా 3 కి.మీ
Anam Mirza: కోట్లు సంపాదిస్తున్న సానియా మీర్జా చెల్లెలు.. ఆస్తి ఎంతంటే ??