ప్రపంచంలో ఎవరిపై అయినా జూమ్‌ !! నింగిలోకి నిఘా ఉపగ్రహం

ప్రపంచంలో ఎవరిపై అయినా జూమ్‌ !! నింగిలోకి నిఘా ఉపగ్రహం

Phani CH

|

Updated on: Feb 28, 2024 | 8:52 PM

రోదసి నుంచి ప్రపంచంలో ఎవరిపైనైనా, ఎవరు ఎక్కడున్నా వారిపై తీక్షణంగా నిఘా పెట్టగలిగే ఓ అత్యంత శక్తివంతమైన ఉపగ్రహాన్ని వచ్చే ఏడాది నింగిలోకి ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమవుతుంది. అమెరికా స్టార్టప్‌ ‘అల్బెడో’ రూపొందించిన ఈ ఉపగ్రహాన్ని భూమి ఉపరితలానికి కేవలం 100 మైళ్ల ఎత్తులో ప్రవేశపెట్టనున్నారు. నింగి నుంచి వ్యక్తులపై లేదా ఏదైనా వస్తువులు, ప్రాంతాలపై నిశితంగా దృష్టి సారించగలదని నిపుణులు చెప్తున్నారు.

రోదసి నుంచి ప్రపంచంలో ఎవరిపైనైనా, ఎవరు ఎక్కడున్నా వారిపై తీక్షణంగా నిఘా పెట్టగలిగే ఓ అత్యంత శక్తివంతమైన ఉపగ్రహాన్ని వచ్చే ఏడాది నింగిలోకి ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమవుతుంది. అమెరికా స్టార్టప్‌ ‘అల్బెడో’ రూపొందించిన ఈ ఉపగ్రహాన్ని భూమి ఉపరితలానికి కేవలం 100 మైళ్ల ఎత్తులో ప్రవేశపెట్టనున్నారు. నింగి నుంచి వ్యక్తులపై లేదా ఏదైనా వస్తువులు, ప్రాంతాలపై నిశితంగా దృష్టి సారించగలదని నిపుణులు చెప్తున్నారు. దీన్ని నింగిలో ప్రవేశపెడితే ప్రజల వ్యక్తిగత గోప్యతకు తీవ్రమైన ముప్పు వాటిల్లడం ఖాయమని, ఓ ‘బిగ్‌ బ్రదర్‌’ నిత్యం మనల్ని, మన కదలికలను సునిశితంగా గమనించే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉపగ్రహాన్ని ‘అంతరిక్షంలో ఉండే భారీ కెమెరా’గా ఎలక్ట్రానిక్‌ ఫ్రాంటియర్‌ ఫౌండేషన్‌ జనరల్‌ కౌన్సెల్‌ జెన్నిఫర్‌ లించ్‌ అభివర్ణించారు. మనకు తెలియకుండా దీన్ని ఏ ప్రభుత్వమైనా, ఎప్పుడైనా ఉపయోగించవచ్చని ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పత్రికకు తెలిపారు. అయితే మనుషుల ముఖాలను గుర్తించగలిగే ఫేసియల్‌ రికగ్నిషన్‌ సాఫ్ట్‌వేర్‌ ఈ ఉపగ్రహంలో ఉండదని ‘అల్బెడో’ చెప్తున్నప్పటికీ.. ఇది వ్యక్తులను చిత్రీకరించదని గానీ లేదా ప్రజల గోప్యతను పరిరక్షిస్తుందని అని గానీ భరోసా ఇవ్వడం లేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మెట్రో రైలు ఎక్కకుండా రైతును అడ్డుకున్న సెక్యూరిటీ అధికారులపై నెటిజన్లు ఫైర్‌

కారు బానెట్‌పై వ్యక్తిని ఈడ్చుకెళ్లిన డ్రైవర్‌ !! కేకలు వేసినా ఆపకుండా 3 కి.మీ

Anam Mirza: కోట్లు సంపాదిస్తున్న‌ సానియా మీర్జా చెల్లెలు.. ఆస్తి ఎంతంటే ??