కోరుకున్న రొట్టె తింటే.. కోరిక నెరవేరుతుందట

|

Jul 20, 2024 | 8:51 PM

నెల్లూరు రొట్టెల పండగకు వేళయింది. రొట్టెల పండగకు పక్క రాష్ట్రాల నుంచి కూడా జనం నెల్లూరుకు క్యూ కట్టారు. ప్రతి ఏటా మొహర్రం తర్వాత రోజు రొట్టెల పండుగ నిర్వహించటం ఆనవాయితీ. అందులో భాగంగా నేటి నుంచి 21 వరకు ఐదు రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది. ఇందులో పాల్గొనటానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తున్నారు. రొట్టెల పండగ కోసం మునుపెన్నడూ లేని విధంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

నెల్లూరు రొట్టెల పండగకు వేళయింది. రొట్టెల పండగకు పక్క రాష్ట్రాల నుంచి కూడా జనం నెల్లూరుకు క్యూ కట్టారు. ప్రతి ఏటా మొహర్రం తర్వాత రోజు రొట్టెల పండుగ నిర్వహించటం ఆనవాయితీ. అందులో భాగంగా నేటి నుంచి 21 వరకు ఐదు రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది. ఇందులో పాల్గొనటానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తున్నారు. రొట్టెల పండగ కోసం మునుపెన్నడూ లేని విధంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దగ్గరుండి జాతరకు కావాల్సిన పనులను పర్యవేక్షిస్తున్నారు. బారా షాహిద్‌ దర్గాలో జరిగే ఈ రొట్టెల పండుగకు రాష్ట్రం నలుమూలల నుంచే గాక దేశ,విదేశాల నుంచి సైతం భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర పండుగగా ప్రభుత్వం దీన్ని గుర్తించింది. అందుకు తగ్గ హంగులన్నీ అధికార యంత్రంగా కల్పించింది. దర్గా ప్రాంగణం మొత్తం రంగులు వేయటంతో పాటు విద్యుత్ దీపాలతో అలంకరించారు. పండుగకు వచ్చే భక్తులకు మంచినీరు, భోజనం, పార్కింగ్‌ వసతి కల్పించారు. ఈ ఉత్సవంలో కోర్కెల రొట్టెలు దొరుకుతాయి. ఎవరికి ఏ కోరిక తీరాలని ఉంటే ఆ రొట్టెలు తీసుకుంటుంటారు. ఆరోగ్య రొట్టె, విద్యా రొట్టె, వ్యాపార రొట్టె, ఉద్యోగ రొట్టె.. ఇలా కోరికలను బట్టి రొట్టెలు దొరుకుతుతాయి అక్కడ.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిన్న బోటులో పెడలింగ్‌ చేస్తున్న నావికుడికి సర్‌ప్రైజ్‌

చాందిపుర వైరస్‌తో చిన్నారులు మృతి

వర్షాకాలంలో చర్మసౌందర్యానికి ఇంటి చిట్కాలు

అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‌ మన తెలుగింటి అల్లుడే

చంద్రుడిపై భారీ గుహ !! మరో వందకు పైగా ఉంటాయని సైంటిస్టుల అంచనా