చంద్రుడిపై భారీ గుహ !! మరో వందకు పైగా ఉంటాయని సైంటిస్టుల అంచనా
చంద్రుడిపై పర్వతాలు, లోయలు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించిన అంతరిక్ష పరిశోధకులు తాజాగా మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు. చంద్రుడి ఉపరితలంపై ఓ భారీ గుహను గుర్తించినట్లు ఇటలీ సైంటిస్టులు తెలిపారు. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కాలుమోపిన ప్రాంతానికి దగ్గర్లోనే ఈ భారీ గుహ ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో చంద్రుడిపైకి వెళ్లే ఆస్ట్రోనాట్లకు ఇది ఆవాసంగా ఉపయోగపడుతుందని తెలిపారు.
చంద్రుడిపై పర్వతాలు, లోయలు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించిన అంతరిక్ష పరిశోధకులు తాజాగా మరో సంచలన విషయాన్ని బయటపెట్టారు. చంద్రుడి ఉపరితలంపై ఓ భారీ గుహను గుర్తించినట్లు ఇటలీ సైంటిస్టులు తెలిపారు. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కాలుమోపిన ప్రాంతానికి దగ్గర్లోనే ఈ భారీ గుహ ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో చంద్రుడిపైకి వెళ్లే ఆస్ట్రోనాట్లకు ఇది ఆవాసంగా ఉపయోగపడుతుందని తెలిపారు. సోలార్ రేడియేషన్, కాస్మిక్ కిరణాల నుంచి ఆస్ట్రోనాట్లకు రక్షణ కల్పిస్తాయని వివరించారు. అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ 55 ఏళ్ల క్రితం చంద్రుడిపై కాలుమోపింది. ఆర్మ్ స్ట్రాంగ్ దిగిన చోటు నుంచి దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఈ బిలాన్ని గుర్తించామని ఇటలీ సైంటిస్టుల బృందం సోమవారం నిర్ధారించింది. చంద్రుడి చుట్టూ తిరుగుతున్న నాసా రికన్నైసెన్స్ ఆర్బిటర్ పంపిన రాడార్ మెజర్ మెంట్స్ ఆధారంగా ఈ బిలాన్ని కనుగొన్నామని తెలిపింది. అగ్నిపర్వతం వెదజల్లిన లావా కారణంగా ఈ బిలం ఏర్పడి ఉంటుందని సైంటిస్టులు పేర్కొన్నారు. ఈ గుహ వెడల్పు కనీసం 40 మీటర్లు ఉంటుందని, పొడవు మరింత ఎక్కువగా ఉండొచ్చని తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సముద్రఖనితో వేణు స్వామి ప్రత్యేక పూజలు !! నైవేద్యంగా మటన్ కర్రీ !!
గ్రీన్‌ఫీల్డ్ రోడ్ రెడీ.. ఇక చెన్నైకి కేవలం 5 గంటల్లోనే..
కాకిని పట్టుకుని కట్టేసిన దుకాణదారుడు !! నిరసనగా దండెత్తిన వందలాది కాకులు
ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేస్తున్నారా ?? ఆ టైమ్ లో అయితే నో ఫైన్ ??
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

