గ్రీన్‌ఫీల్డ్ రోడ్ రెడీ.. ఇక చెన్నైకి కేవలం 5 గంటల్లోనే..
బెంగళూరు- చెన్నై గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారి సిద్ధమైంది. కేంద్ర భూఉపరితల రవాణాశాఖ రహదారిని నిర్మించింది. రూ.17,930 కోట్లు ఖర్చుతో నాలుగు లేన్ల ఈ రోడ్డును నిర్మించారు. ఈ ఏడాది ఆఖరులో ఈ మార్గం పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుందని జాతీయ రహదారి ప్రాధికార సంస్థ అధికారులు తెలిపారు. 262 కిలోమీటర్ల రహదారి... కర్ణాటక సరిహద్దు వరకు 110 కిలోమీటర్ల మేర ఉంది. మిగతా రవాణా మార్గం ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడులోకి ప్రవేశించనుంది.
బెంగళూరు- చెన్నై గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ జాతీయ రహదారి సిద్ధమైంది. కేంద్ర భూఉపరితల రవాణాశాఖ రహదారిని నిర్మించింది. రూ.17,930 కోట్లు ఖర్చుతో నాలుగు లేన్ల ఈ రోడ్డును నిర్మించారు. ఈ ఏడాది ఆఖరులో ఈ మార్గం పూర్తి స్థాయిలో ప్రారంభమవుతుందని జాతీయ రహదారి ప్రాధికార సంస్థ అధికారులు తెలిపారు. 262 కిలోమీటర్ల రహదారి… కర్ణాటక సరిహద్దు వరకు 110 కిలోమీటర్ల మేర ఉంది. మిగతా రవాణా మార్గం ఆంధ్రప్రదేశ్ మీదుగా తమిళనాడులోకి ప్రవేశించనుంది. ఈ రహదారి నిర్మాణంతో బెంగళూరు నుంచి చెన్నైకు కేవలం ఐదు గంటల్లో చేరుకోవచ్చు. రహదారికి ఇరువైపులా పారిశ్రామిక వాడలను అభివృద్ధి చేస్తారు. ఇప్పటికే బెంగళూరు గ్రామీణ జిల్లాలో పలు పారిశ్రామిక వాడలు ఏర్పడ్డాయి. రవాణా వ్యవస్థ ఉన్నందున పారిశ్రామిక వాడలు అభివృద్ధి చెందే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. హొసకోట శివార్ల నుంచి దేవనహళ్లి, హోసూరు, తూమకూరు తదితర ప్రాంతాలకు వెళ్లే విధంగా రింగ్ రోడ్డు వంతెనలను నిర్మించారు. వాహనాలు ఎక్కడా ఆగకుండా వెళ్లేలా రోడ్లను అభివృద్ధి చేశారు. కోలారు, చిత్తూరు ప్రాంతాలతో పాటు పారిశ్రామిక వాడల నుంచి నేరుగా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేలా రహదారిని అభివృద్ధి చేశారు. ఈ రోడ్డు మార్గం వల్ల సమయం, ఇంధనం ఆదా అవుతుందని అధికారులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కాకిని పట్టుకుని కట్టేసిన దుకాణదారుడు !! నిరసనగా దండెత్తిన వందలాది కాకులు
ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేస్తున్నారా ?? ఆ టైమ్ లో అయితే నో ఫైన్ ??