AP News: అర్ధరాత్రి చెరువు మాటున చాటుమాటు యవ్వారం.. కట్ చేస్తే.. పోలీసుల ఎంట్రీతో

AP News: అర్ధరాత్రి చెరువు మాటున చాటుమాటు యవ్వారం.. కట్ చేస్తే.. పోలీసుల ఎంట్రీతో

Ravi Kiran

|

Updated on: Jul 19, 2024 | 7:34 PM

ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో 28 ఎర్రచందనం దుంగలతో పాటు, ఒక కారును స్వాధీనం చేసుకుని, ముగ్గురు స్మగ్లర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు, అటవీ సిబ్బంది కలిపి సంయుక్తంగా గురువారం ప్రకాశం జిల్లా కొమరోలు మండలం..

ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో 28 ఎర్రచందనం దుంగలతో పాటు, ఒక కారును స్వాధీనం చేసుకుని, ముగ్గురు స్మగ్లర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు, అటవీ సిబ్బంది కలిపి సంయుక్తంగా గురువారం ప్రకాశం జిల్లా కొమరోలు మండలం వైపు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు తనిఖీ చేశారు. అర్ధరాత్రి ప్రకాశం టెరిటోరియల్ ఫారెస్టు డివిజన్ బెస్తవారి పేట రేంజి తాటిచెర్ల సెక్షన్, నల్లకుంట్ల అటవీ బీటు పరిధిలోని అక్కాపల్లి చెరువు చేరుకున్నారు. అక్కడ ఒక కారు నిలిచి ఉండగా, అందులో ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తూ కనిపించారు. దీంతో వారిని టాస్క్ ఫోర్సు సిబ్బంది చుట్టుముట్టగా, వారు వాహనం వదిలి పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే వారిని వెంబడించి ముగ్గురిని పట్టకోగలిగారు. కింద 11 దుంగలు, కారులో 17 దుంగలు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్టు చేశారు. వారిని ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్‌కు చెందిన పేరం రామరాజు (44), సంచర్ల పంచాయితీ రామేశ్వరం గ్రామానికి చెందిన రాచకొండ రామయ్య (25), క్రిష్ణంశెట్టి పల్లి మండలం షేక్ ఖాసిం (43)లుగా గుర్తించారు. పేరం రామరాజు అనే వ్యక్తికి తమిళనాడుకు చెందిన స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తెలిసింది. ఈ కేసును తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్‌లో నమోదు చేయగా, సీఐ సురేష్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..