చిన్న బోటులో పెడలింగ్ చేస్తున్న నావికుడికి సర్‌ప్రైజ్
అట్లాంటిక్ నడి సముద్రంలో సాహసోపేతంగా పెడలింగ్ చేస్తున్న నావికుడికి అనుకోని మిత్రబృందం ఎదురైంది. భారీ సంఖ్యలో పైలట్ వేల్స్ అనే ఒక రకమైన భారీ తిమింగలాలు అతడిని అనుసరించాయి. టామ్ వాడ్డింగ్టన్ అనే స్కీయర్ కెనడాలోని న్యూ ఫౌండ్‌ల్యాండ్ నుంచి ఇంగ్లండ్‌కు సముద్ర మార్గంలో ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకొన్నాడు. ఈ క్రమంలో అతడు జులై 7న ఉదయం నిద్ర లేచి చూసేసరికి అట్లాంటిక్ సముద్రం మధ్యలోకి చేరుకొన్నాడు.
అట్లాంటిక్ నడి సముద్రంలో సాహసోపేతంగా పెడలింగ్ చేస్తున్న నావికుడికి అనుకోని మిత్రబృందం ఎదురైంది. భారీ సంఖ్యలో పైలట్ వేల్స్ అనే ఒక రకమైన భారీ తిమింగలాలు అతడిని అనుసరించాయి. టామ్ వాడ్డింగ్టన్ అనే స్కీయర్ కెనడాలోని న్యూ ఫౌండ్‌ల్యాండ్ నుంచి ఇంగ్లండ్‌కు సముద్ర మార్గంలో ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకొన్నాడు. ఈ క్రమంలో అతడు జులై 7న ఉదయం నిద్ర లేచి చూసేసరికి అట్లాంటిక్ సముద్రం మధ్యలోకి చేరుకొన్నాడు. అక్కడ అతడికి ఆశ్చర్యకరమైన అనుభవం ఎదురైంది. డజన్ల కొద్దీ పైలట్ వేల్స్ అతడిని అనుసరించడం మొదలుపెట్టాయి. అతడి చిన్న బోటు సమీపానికి చేరుకున్న కొన్ని ఆడుకుని వెళ్లిపోతున్నాయి. అతడు వాటిని చూసి ముచ్చటపడినా.. తన చిన్న పడవను ఢీకొంటాయేమోనని లోలోపల భయపడ్డాడు. కొద్దిసేపటి తర్వాత ఆ తిమింగలాలు పడవకు మరింత దగ్గరగా రావడంతో చిత్రీకరణను నిలిపివేశాడు. అతడు బ్రిటన్‌లోని మైండ్ ఛారిటీ అనే సంస్థ కోసం నిధులు సేకరించేందుకు ఈ యాత్ర చేపట్టాడు. దాదాపు 2,000 నాటికల్ మైళ్లు ప్రయాణించి అతడు లండన్ చేరుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియోను అతడు ఇన్‌స్టాలో షేర్ చేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చాందిపుర వైరస్‌తో చిన్నారులు మృతి
వర్షాకాలంలో చర్మసౌందర్యానికి ఇంటి చిట్కాలు
అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్ మన తెలుగింటి అల్లుడే
చంద్రుడిపై భారీ గుహ !! మరో వందకు పైగా ఉంటాయని సైంటిస్టుల అంచనా
సముద్రఖనితో వేణు స్వామి ప్రత్యేక పూజలు !! నైవేద్యంగా మటన్ కర్రీ !!
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

