చాందిపుర వైరస్‌తో చిన్నారులు మృతి

చాందిపుర వైరస్‌తో చిన్నారులు మృతి

Phani CH

|

Updated on: Jul 19, 2024 | 8:20 PM

గుజరాత్‌లో అనుమానాస్పద వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. దాని వల్ల జులై 10 నుంచి ఇప్పటివరకు ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా వైరస్ సోకిన వారి సంఖ్య 12కు చేరిందని ఆరోగ్య శాఖ మంత్రి రిషికేశ్‌ పటేల్ వెల్లడించారు. బాధితులు సబర్‌కాంతా, ఆరావళి, మహిసాగర్, ఖేడా జిల్లాలకు చెందినవారని మంత్రి తెలిపారు. దోమల ద్వారా వ్యాపించే చాందీపుర వైరస్‌లో ఫ్లూ జ్వరం ప్రధాన లక్షణాలని తెలిపారు.

గుజరాత్‌లో అనుమానాస్పద వైరస్‌ కలకలం సృష్టిస్తోంది. దాని వల్ల జులై 10 నుంచి ఇప్పటివరకు ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా వైరస్ సోకిన వారి సంఖ్య 12కు చేరిందని ఆరోగ్య శాఖ మంత్రి రిషికేశ్‌ పటేల్ వెల్లడించారు. బాధితులు సబర్‌కాంతా, ఆరావళి, మహిసాగర్, ఖేడా జిల్లాలకు చెందినవారని మంత్రి తెలిపారు. దోమల ద్వారా వ్యాపించే చాందీపుర వైరస్‌లో ఫ్లూ జ్వరం ప్రధాన లక్షణాలని తెలిపారు. మెదడు వాపుకు దారి తీసి వారం లోపే మృత్యువుకు చేరువ చేస్తుందని అన్నారు. వారిలో రాజస్థాన్‌, మధ్యప్రదేశ్ వారు కూడా ఉన్నారని, అందరికీ గుజరాత్‌లోనే చికిత్స అందుతోందని చెప్పారు. అనుమానిత చాందీపుర వైరస్‌ వల్లే ఆరు మరణాలు సంభవించాయని ప్రాథమికంగా తెలుస్తోందనీ పూర్తిస్థాయి ధ్రువీకరణ నిమిత్తం నమూనాలను పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్లు మంత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ వైరస్‌ సోకిన వ్యక్తిలో జ్వరం, ఫ్లూ, మెదడువాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దోమలు, ఇతర కీటకాల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. ‘‘ఈ వైరస్ అంటువ్యాధి కాదు. ఈ వైరస్‌ను అదుపులో ఉంచేందుకు ప్రభావిత ప్రాంతాల్లో కట్టుదిట్ట చర్యలు చేపడుతున్నాం. ఇప్పటివరకు 18,646 మందిని పరీక్షించాం’’ అని మంత్రి తెలిపారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వర్షాకాలంలో చర్మసౌందర్యానికి ఇంటి చిట్కాలు

అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‌ మన తెలుగింటి అల్లుడే

చంద్రుడిపై భారీ గుహ !! మరో వందకు పైగా ఉంటాయని సైంటిస్టుల అంచనా

సముద్రఖనితో వేణు స్వామి ప్రత్యేక పూజలు !! నైవేద్యంగా మటన్ కర్రీ !!

గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్‌ రెడీ.. ఇక చెన్నైకి కేవలం 5 గంటల్లోనే..