ఉగ్ర ముఠా టార్గెట్ అవేనా? వీడియో

Updated on: Nov 13, 2025 | 4:44 PM

ఢిల్లీ కార్ బ్లాస్ట్ కేసులో దర్యాప్తు సంస్థలు భయంకరమైన విషయాలను వెలుగులోకి తెచ్చాయి. జైషే మహమ్మద్ మద్దతుతో పనిచేస్తున్న డాక్టర్స్ టెర్రర్ మాడ్యూల్ 200 ఐఈడీలతో భారీ దాడులకు ప్లాన్ చేసినట్లు తేలింది. ఇండియా గేట్, ఎర్రకోట వంటి ప్రదేశాలు లక్ష్యంగా చేసుకొని, మహిళా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని చూసిన ఉగ్రవాదుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి.

ఢిల్లీలో జరిగిన కారు పేలుడు ఘటన యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేయగా, దిగ్భ్రాంతి కలిగించే విషయాలు బయటపడ్డాయి. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ మద్దతుతో పనిచేస్తున్న డాక్టర్స్ టెర్రర్ మాడ్యూల్ దీని వెనుక ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ముఠా సుమారు 200 ఐఈడీలను తయారు చేసి, 26/11 ముంబై దాడుల తరహాలో దేశ రాజధానిలో భారీ దాడులకు ప్లాన్ చేసినట్లు తేలింది. ఇండియా గేట్, ఎర్రకోట వంటి కీలక ప్రదేశాలు, రిపబ్లిక్ డే వేడుకలు వారి లక్ష్యాల్లో ఉన్నాయని దర్యాప్తులో వెల్లడైంది.

మరిన్ని వీడియోల కోసం :

మరో స్పెషల్‌ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తమన్నా వీడియో

మాట జారాను.. మన్నించండి వీడియో

మోడల్‌ మిస్టరీ డెత్! ప్రియుడే కిరాతకుడు?వీడియో

మీ బ్యాంక్‌ ఎకౌంట్‌ భద్రమేనా? వీడియో

Published on: Nov 13, 2025 03:41 PM