ఢిల్లీ విమానాశ్రయంలో 2027 నాటికి ఎయిర్ ట్రైన్.. ప్రత్యేకతలివే
దేశంలోనే తొలి ఎయిర్ ట్రైన్ - ఆటోమేటెడ్ పీపుల్ మూవర్ సర్వీసు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభం కానుంది. ఎయిర్ ట్రైన్ అనేది మెట్రో తరహాలోని డ్రైవర్ లేని రైలు. ప్రయాణికులు ఇప్పటివరకూ విమానాశ్రయంలోని మూడు టెర్మినళ్లకు వెళ్లేందుకు, లేదా విమానాన్ని డీబోర్డింగ్ చేశాక క్యాబ్‌ను ఎక్కేందుకు బస్సు సర్వీస్‌ను ఉపయోగిస్తున్నారు. దీనికి చాలా సమయం వృథా అవుతుంది.
దేశంలోనే తొలి ఎయిర్ ట్రైన్ – ఆటోమేటెడ్ పీపుల్ మూవర్ సర్వీసు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రారంభం కానుంది. ఎయిర్ ట్రైన్ అనేది మెట్రో తరహాలోని డ్రైవర్ లేని రైలు. ప్రయాణికులు ఇప్పటివరకూ విమానాశ్రయంలోని మూడు టెర్మినళ్లకు వెళ్లేందుకు, లేదా విమానాన్ని డీబోర్డింగ్ చేశాక క్యాబ్‌ను ఎక్కేందుకు బస్సు సర్వీస్‌ను ఉపయోగిస్తున్నారు. దీనికి చాలా సమయం వృథా అవుతుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం రూ. రెండు వేల కోట్లతో 7.7 కి.మీ. పొడవునా ఎయిర్ రైలు వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2027 నాటికి ఇది అందుబాటులోకి వస్తే ప్రస్తుతమున్న బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. ఎయిర్ ట్రైన్ అనేది పరిమిత సంఖ్యలో కంపార్ట్‌మెంట్‌లతో ఉంటుంది. ఇది ట్రాక్‌లపై నడుస్తుంది. నిర్ణీత ట్రాక్‌లో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళుతుంది. దీంతో వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతుంది. విమానాశ్రయంలోని ఇతర టెర్మినళ్లు, పార్కింగ్ స్థలాలు, క్యాబ్ పికప్ పాయింట్లు, హోటళ్లు మొదలైన వాటిని చేరుకోవడానికి ఎయిర్ ట్రైన్స్ ఉపయోగపడనున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పని ఒత్తిడికి బ్యాంక్ ఉద్యోగిని బలి.. డ్యూటీలోనే కుప్పకూలి మృతి
విమాన ప్రయాణాలపై ఎపెక్ట్ ?? తప్పదంటున్న శాస్తవేత్తలు
అరకులోయలో పారా గ్లైడింగ్.. ట్రయల్ రన్ సక్సెస్
కోనసీమ కొబ్బరికి మహర్దశ.. ఒక్క నెలలో ధర ఎంత పెరిగిందంటే ??
బెలూన్లలో చెత్త నింపి వదులుతున్న ఉత్తరకొరియా.. భయంతో కేకలు వేసిన పిల్లలు