Andhra Pradesh: వామ్మో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత అప్పు ఉందా..
ఏపీ అప్పుల గురించి సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర విభజనతో జరిగిన నష్టం కంటే.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నష్టం ఎక్కువని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో సంపద సృష్టించే పని ఒక్కటి కూడా చేయలేదని.. పెట్టబడులు పెట్టేందుకు వస్తే.. తరిమేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంత అప్పు ఉందో సీఎం చంద్రబాబు అసెంబ్లీలో వెల్లడించారు.
- గవర్నమెంట్ అప్పు – రూ.4,38,278 కోట్లు
- పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ – రూ.80,914 కోట్లు
- కార్పొరేషన్స్ నుంచి తీసుకున్న అప్పులు – రూ.2,48,677 కోట్లు
- సివిల్ సప్లైస్‌లో అప్పు – రూ.36,000 కోట్లు
- పవర్ సెక్టార్‌కి ఇవ్వాల్సిన అప్పు – రూ.34,267 కోట్లు
- అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్స్ అన్ని స్కీమ్స్ – రూ.1,13,244 కోట్లు
- అవుట్ స్టాండింగ్ డ్యూస్ టూ ఎంప్లాయీస్ – రూ. 21,980 కోట్లు
- నాన్ కాంట్రిబ్యూషన్ సింకింగ్ ఫండ్ – రూ.1,191 కోట్లు.
మొత్తంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు రూ.9,74,556 కోట్లుగా సీఎం చంద్రబాబు అసెంబ్లీలో తెలిపారు. ఇది కాదని ఎవరైనా అంటే, అసెంబ్లీకి రండి.. లెక్కలు తేల్చుదాం అని సవాల్ విసిరారు చంద్రబాబు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Published on: Nov 15, 2024 04:43 PM
Latest Videos
వైరల్ వీడియోలు