న్యూజిలాండ్ పార్లమెంట్లో మావోరీ తెగకు చెందిన ఎంపీ మరోసారి సంచలనం సృష్టించింది. గత ఏడాది పార్లమెంట్లో ఆమె అడుగుపెట్టిన తర్వాత.. తన గిరిజన కమ్యూనిటీ పై వివక్షను ప్రశ్నిస్తూ ఎంపీ హన-రాహితి పార్లమెంటులో చేసిన ప్రసంగం ప్రకంపలను రేపింది. గిరిజన సంప్రదాయ పద్దతిలో హక చేస్తూ నిరసన వ్యక్తం చేసింది. ఇక, ఇప్పుడు మరోసారి హన-రాహితి ఇలా నిరసన తెలిపారు. తనదైన శైలిలో డ్యాన్స్ చేస్తూ ఆమె నిరసన తెలిపారు.