Ind vs Aus: భారత్ ప్రాక్టీస్ సెషన్‌లో ఫన్నీ సీన్.. బుమ్రా పంత్‌ల మధ్య రూ.8వేల పందెం..చివరికి..

నవంబర్ 22 నుంచి ఆస్ట్రేలియాతో టీమిండియా తొలి టెస్టు మ్యాచ్ ఆడనుంది. పెర్త్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు ముందు భారత జట్టు ప్రాక్టీస్ చేస్తోంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో ఓ ఆసక్తికరమైన సంఘటన జరిగింది. జస్ప్రీత్ బుమ్రా మరియు రిషబ్ పంత్ మధ్య ఓ పందెం జరిగింది. చివరికి ఎవరు గెలిచారంటే?

Ind vs Aus: భారత్ ప్రాక్టీస్ సెషన్‌లో ఫన్నీ సీన్.. బుమ్రా పంత్‌ల మధ్య రూ.8వేల పందెం..చివరికి..
Rishabh Pant Bets 100 Dollars With Jasprit Bumrah Dismisses Him
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Nov 15, 2024 | 6:15 PM

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా ఆటగాళ్లు చాలా ప్రాక్టీస్ చేస్తున్నారు. నవంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే పెర్త్ టెస్టుకు ముందు ఆటగాళ్లందరూ నెట్స్‌లో చెమటలు చిందిస్తున్నారు. అయితే ప్రాక్టీస్ సేషన్లో సరదా సంఘటన చోటుచేసుకుంది. జస్ప్రీత్ బుమ్రా మరియు రిషబ్ పంత్ మధ్య ఓ ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది. డబ్ల్యూఏసీఏ స్టేడియంలో వీరిద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ సందర్భంగా 100 డాలర్లు అంటే దాదాపు 8 వేల రూపాయల పందెం కూడా పెట్టారు. పెర్త్‌లో ఏం జరిగిందంటే?

పెర్త్‌లో బౌన్స్ , పేస్‌ను అర్థం చేసుకోవడానికి టీమ్ ఇండియా ప్రతిరోజూ గంటల తరబడి కష్టపడుతుంది. దీనికి సంబంధించి ఆటగాళ్లంతా గంటల తరబడి బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే ఈరోజు ప్రాక్టిస్ మ్యాచ్లో బుమ్రా, పంత్‌లు అందుకు భిన్నంగా ప్రయత్నించారు. బుమ్రా చేతిలో బ్యాట్ పట్టుకుని కనిపించగా రిషబ్ పంత్ అతనికి బౌలింగ్ చేశాడు. బుమ్రా సులువుగా ఆడే విధంగా కొన్ని బంతులను పంత్ వేశాడు. ఆ తర్వాత బౌన్సర్‌ వేసి అవుట్ చేశాడు. దీని తర్వాత, పంత్ కెమెరా వైపు చూస్తూ అభిమానులతో, ‘నేను జస్ప్రీత్ బుమ్రాను బౌల్డ్ చేసాను, అతన్ని నెట్స్‌లో అవుట్ చేసి వికెట్ తీసుకున్నాను’ అని చెప్పాడు.

ఔట్ పై వారిద్దరి మధ్య $100 పందెం జరిగింది. ‘ఇది అవుట్ కాదు. ? పుల్ షాట్ ను బాగా కనెక్ట్ చేశాను. అక్కడ ఏడుగురు ఫీల్డర్లు ఉన్నారని అతను భావిస్తున్నాడు. పంత్‌ను బౌలింగ్ చేయడానికి అనుమతించకూడదు’ అని బుమ్రా అంటున్నాడు. . అయితే పంత్ మోర్కెల్‌ను అవుట్ కాదా అని అడిగాడు,  అతను పంత్ కు మద్దతు ఇచ్చాడు. ప్రస్తుతం దానికి సంబంధిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ప్రారంభం కావడానికి ఎక్కువ సమయం లేదు. టెస్టు సిరీస్ నవంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. అయితే తాజాగా భారత అభిమానులను షాక్ ఇచ్చే ఓ వార్త నెటింట్లో చక్కర్లు కొడుతుంది. విరాట్ కోహ్లీ గాయపడ్డినట్లు కొన్ని మీడియా కథనాలు బయటకు వచ్చాయి. అయినప్పటికీ విరాట్ ఆస్ట్రేలియాలో కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. విరాట్ కోహ్లిని ఇటీవల స్కాన్ చేశారని, అయితే ఆటగాడు ఎక్కడ గాయపడ్డాడో ఇంకా తెలియరాలేదని ఆస్ట్రేలియా మీడియా పేర్కొంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్రప్రదేశ్‌కు ఎంత అప్పు ఉందో అసెంబ్లీలో వెల్లడించిన చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్‌కు ఎంత అప్పు ఉందో అసెంబ్లీలో వెల్లడించిన చంద్రబాబు..
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!