మిచౌంగ్‌ తుఫానుతో చెన్నై అతలాకుతలం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

|

Dec 05, 2023 | 9:49 PM

మిచౌంగ్‌ తుపానుతో తమిళనాడు రాజధాని చెన్నై అతలాకుతలమైంది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు చోట్ల వీధుల్లోకి భారీగా వరద నీరు చేరి పలు కార్లు కొట్టుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరింది. పలు కాలనీల్లో నీరు నిలిచిపోవడంతో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. చెంగల్పట్టు సమీపంలోని సముద్రతీర ప్రాంతం నుంచి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది.

మిచౌంగ్‌ తుపానుతో తమిళనాడు రాజధాని చెన్నై అతలాకుతలమైంది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు చోట్ల వీధుల్లోకి భారీగా వరద నీరు చేరి పలు కార్లు కొట్టుకుపోయాయి. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరింది. పలు కాలనీల్లో నీరు నిలిచిపోవడంతో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. చెంగల్పట్టు సమీపంలోని సముద్రతీర ప్రాంతం నుంచి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. చెన్నైలోని వెలచ్చేరి, పల్లికరణై ప్రాంతాల్లో రోడ్లు నదులను తలపిస్తున్నాయి. నగరంలో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. చెన్నై ఎయిర్‌పోర్టు రన్‌వేపైకి భారీగా వరద నీరు చేరింది. దీంతో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటివరకు 16 విమాన సర్వీసులను రద్దు చేశారు. మరికొన్ని విమానాలను దారిమళ్లించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భారత్ మరో విజయం.. ఇస్రో మరో ప్రయోగం సక్సెస్‌

అయోధ్యలో ప్రతిష్టించడానికి సిద్ధమవుతున్న ధ్వజస్తంభాలు ఇవే

థాయ్ లాండ్ లో ప్రమాదం.. 14 మంది మృతి

హైదరాబాద్‌పై మిచౌంగ్ ఎఫెక్ట్‌.. రెండు రోజులు అతి భారీ వర్షాలు

Cyclone Michaung: తిరుమలలో తుపాన్ ఎఫెక్ట్.. భారీ వర్షం, ఈదురు గాలులు