రెండువేల నోట్ల ముద్రణ నిలిపివేత !! అన్ని ప్రాంతాలకు సమానంగా పంపిణీ కాకపోవడమే కారణమన్న కేంద్రం
2016లో దేశంలోని 1000రూపాయలు, 500 రూపాయల నోట్లను రద్దు చేసింది మోదీ ప్రభుత్వం. ఆ తర్వాత మరింత పెద్ద నోటు 2000 రూపాయల నోటును అందుబాటులోకి తెచ్చారు.
2016లో దేశంలోని 1000రూపాయలు, 500 రూపాయల నోట్లను రద్దు చేసింది మోదీ ప్రభుత్వం. ఆ తర్వాత మరింత పెద్ద నోటు 2000 రూపాయల నోటును అందుబాటులోకి తెచ్చారు. 2016 నాటికి దేశవ్యాప్తంగా మొత్తం కరెన్సీలో వెయ్యి, ఐదువందల రూపాయల నోట్ల వాటా 80 శాతం వరకూ ఉంది. కాగా గత మూడేళ్ళుగా రెండువేల రూపాయల నోట్ల ముద్రణ నిలిపివేసారు. అన్ని ప్రాంతాలకు సమానంగా ఆ నోట్లు పంపిణీ కాకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సమాచార హక్కు ద్వారా ప్రముఖ వార్తా సంస్థ ఐఏఎన్‌ఎస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఈమేరకు సమాధానమిచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆధ్వర్యంలోని కరెన్సీ ముద్రణాలయాలు నిర్విరామంగా పనిచేసినా పెద్ద మొత్తంలో కరెన్సీని ముద్రించడం కష్టమే. దీంతో 2 వేల నోట్ల ముద్రణను మొదలుపెట్టిన ఆర్బీఐ.. క్రమంగా ఆ నోట్ల ప్రింటింగ్‌ను తగ్గించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 35,429.91 కోట్ల 2 వేల నోట్లను ముద్రించిన ఆర్బీఐ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్.. 2017-18లో 1,115.7 కోట్ల నోట్లను, 2018-19లో కేవలం 466.90 కోట్ల నోట్లను మాత్రమే ముద్రించింది. ఆ తర్వాత 2019 నుంచి ఈ నోట్ల ముద్రణను పూర్తిగా నిలిపివేసింది. 2015లో రిజర్వు బ్యాంకు మహాత్మా గాంధీ సిరీస్-2005లో కొత్త నంబరింగ్ సిస్టంతో కూడిన అన్ని డినామినేషన్ల నూతన కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. వీటిలోని సెక్యూరిటీ ఫీచర్లు చాలా స్పష్టంగా కనిపించేవి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vishal: పెళ్లిపై యాంకర్ అడిగిన ప్రశ్నకు క్లారిటీ ఇచ్చిన విశాల్..
Yashoda: ఓవర్ సీస్‌లోనూ దూసుకెళ్తోన్న ‘యశోద’ !! తిరుగు లేదంటున్న ట్రేడ్ వర్గాలు
అందరూ గాఢ నిద్రలో ఉండగా ఊహించని షాక్.. భయంతో జనం పరుగులు..
Superstar Krishna Final Journey: పద్మాలయ స్టూడియోలో కృష్ణ భౌతికకాయం.. లైవ్ వీడియో