Grey Hair: నెరిసిన వెంట్రుకలు మళ్లీ నల్లబడేలా..

|

Apr 28, 2023 | 9:32 AM

వయసు మీదపడేకొద్దీ మన జుట్టు ఎందుకు నెరుస్తుందన్నది శాస్త్రవేత్తలు గుర్తించారు. నెరిసిన వెంట్రుకలు మళ్లీ నలుపు రంగును సంతరించుకునేలా చేయడానికి ఈ పరిశోధన దోహదపడొచ్చని తెలిపారు. అమెరికాలోని ఎన్‌వైయూ గ్రాస్‌మన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు..

వయసు మీదపడేకొద్దీ మన జుట్టు ఎందుకు నెరుస్తుందన్నది శాస్త్రవేత్తలు గుర్తించారు. నెరిసిన వెంట్రుకలు మళ్లీ నలుపు రంగును సంతరించుకునేలా చేయడానికి ఈ పరిశోధన దోహదపడొచ్చని తెలిపారు. అమెరికాలోని ఎన్‌వైయూ గ్రాస్‌మన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. వీరు ఎలుకలు, మానవుల చర్మంలో ఉండే మెలనోసైట్‌ మూలకణాలను పరిశీలించారు. వెంట్రుకలు పెరిగే క్రమంలో ఈ కణాలు.. కుదుళ్లలోని వివిధ కంపార్ట్‌మెంట్ల మధ్య రాకపోకలు సాగిస్తాయి. ఆ క్రమంలో ఎదురయ్యే ప్రొటీన్‌ సంకేతాల కారణంగా వాటి పరిపక్వ దశలోనూ మార్పులు వస్తాయి. తొలుత ప్రారంభ దశలో ఉండే ఈ కణాలు.. ట్రాన్సిట్‌-యాంప్లిఫయింగ్‌ స్థితికి రూపాంతరం చెందుతాయి. వయసు మీద పడేకొద్దీ.. ఈ ఎంసీఎస్‌సీలు ‘హెయిర్‌ ఫాలికల్‌ బల్జ్‌’ అనే మూలకణ గదిలోనే చిక్కుకుపోతాయి. ఫలితంగా అవి ట్రాన్సిట్‌-యాంప్లిఫయింగ్‌ దశకు పరిపక్వం చెందలేవు. తమ పూర్వ ప్రదేశంలోకీ వెళ్లవు. అక్కడికి వెళ్తేనే అవి పిగ్మెంట్‌ కణాలుగా పునరుత్థానం చెంది, వెంట్రుకల రంగును కొనసాగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మానవుల్లోనూ ఇదే తరహా ప్రక్రియ జరుగుతున్నట్లు నిర్ధారణ అయితే.. హెయిర్‌ ఫాలికల్‌ బల్జ్‌లో చిక్కుకుపోయిన కణాలను మళ్లీ వివిధ కంపార్ట్‌మెంట్ల మధ్య కదిలేలా చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మొబైల్‌ చూస్తూ ట్రైన్‌ నడిపిన మహిళ.. తరువాత ??

వంతెనపై ఆయిల్‌ ట్యాంకర్‌ బ్లాస్ట్‌ !! ఏంజరిగిందంటే ??

బైక్‌పై వస్తారు.. పుటుక్కున తెంచేస్తారు !! రోడ్డుమీదే కాదు ఇళ్లలోనూ !!

లగేజ్‌తో వెళ్తూ కిందపడిపోయిన వ్యక్తి !! ఆ తర్వాత..

రెండేళ్ల చిన్నారికి అరుదైన గుర్తింపు.. ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో..

సింహం బారినుంచి ఆవులమందను కాపాడిన కుక్క !!

Published on: Apr 28, 2023 09:32 AM