ఆర్బీఐ రూ.500 నోట్లను రద్దు చేస్తుందా ?? ఇదిగో క్లారిటీ

Updated on: May 11, 2025 | 9:27 AM

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఎక్స్‌లో ఒక పోస్ట్ ఎక్కువగా వైరల్ అవుతుంది. ఈ పోస్టులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ₹500 రూపాయల నోటును చలామణి నుండి తొలగించాలని నిర్ణయించిందని చెబుతున్నారు. రాబోయే కాలంలో 90% వరకు ఏటీఎంల నుండి ₹100, ₹200 రూపాయల నోట్లు మాత్రమే బయటకు వస్తాయని కూడా వైరల్ పోస్ట్ పేర్కొంది.

ఈ వైరల్ పోస్ట్‌లో ఆర్‌బీఐ బ్యాంకులకు తమ ఏటీఎంలలో ₹100, ₹200 రూపాయల నోట్ల సంఖ్యను పెంచాలని ఆదేశించిందని చెప్పే స్క్రీన్‌షాట్ ఉంది. ఈ పోస్ట్‌ను చూసిన కొందరు ₹500 రూపాయల నోట్లను చలామణి నుంచి తొలగిస్తున్నట్లు భావిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని పరిశోధించినప్పుడు ఆర్‌బీఐ బ్యాంకులకు నిజంగానే ఒక ఆదేశం జారీ చేసింది. అయితే ఈ ఆదేశంలో ₹500 రూపాయల నోటును నిలిపివేయడం గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. అసలు ఆర్‌బీఐ ఆదేశం ఏమిటంటే బ్యాంకులు తమ ఏటీఎంలలో ₹100, ₹200 రూపాయల నోట్ల లభ్యతను పెంచాలని చూస్తుంది. ₹500 రూపాయల నోట్లను ఆర్‌బీఐ నిలిపివేస్తుందా అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. ఆర్‌బీఐ బ్యాంకులకు జారీ చేసిన ఆదేశాల్లో ఈ ₹500 రూపాయల నోట్లను నిలిపివేస్తున్నట్లు ఎటువంటి సూచన కూడా ఇవ్వలేదు. ఈ నోటు మునుపటిలాగే చలామణిలో ఉంటుంది. వైరల్ పోస్ట్‌లో చెప్పిన విషయాలు పూర్తిగా తప్పు. అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త పూర్తిగా తప్పు. ₹500 రూపాయల నోటును నిషేధించలని ఆర్‌బీఐ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఏటీఎంలలో ₹100, ₹200 రూపాయల నోట్ల సంఖ్యను పెంచాలని మాత్రమే బ్యాంకులకు సూచించింది. తద్వారా చిన్న నోట్లు సాధారణ ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంటాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భార్య ముక్కు అందంగా ఉందని కొరికిన భర్త

రోజూ 15 నిమిషాలు సైక్లింగ్ చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా

ఇది మితంగా తీసుకుంటే గుండెకు మేలు చేస్తుంది.. మోతాదు మించితే హానికరం

వాల్ నట్స్ వల్ల ఎన్ని ఉపయోగాలో మీకు తెలుసా ??